Rupee Value: మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ.. రికార్డు కనిష్ఠ స్థాయికి..

Rupee Value: ఇదే పరిస్థితి కొనసాగితే ఒకట్రెండు రోజుల్లోనే రూపాయి విలువ 80 దిగువునకు పడిపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.

Rupee Value: మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ.. రికార్డు కనిష్ఠ స్థాయికి..
Rupee Value
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 12, 2022 | 12:06 PM

Rupee Exchange Value: రూపాయి మారకం విలువ భారీగా క్షీణిస్తోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో మరింత పడిపోయింది. సరికొత్త రికార్డు కనిష్ఠ స్థాయిలో రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చితే 79.58కు క్షీణించింది. ఫోరెక్స్‌లో రూపాయి మారకం విలువ ఈ స్థాయికి క్షీణించడం ఇదే తొలిసారి. ఇంటర్‌బ్యాంక్ ఫోరెక్స్‌లో 79.55 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ.. ఆ తర్వాత కొద్ది సేపటికే 79.58కి క్షీణించింది. క్రితం ముగింపుతో పోల్చితే రూపాయి మారకం విలువ ఏకంగా 13 పైసలు నష్టపోయింది.

ఇదే పరిస్థితి కొనసాగితే ఒకట్రెండు రోజుల్లోనే రూపాయి విలువ 80 దిగువునకు పడిపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఇప్పటి వరకు రూపాయి 80కి ఎగువునే ఉన్నట్లు తెలిపారు. అయితే డాలర్ భారీగా బలపడటంతో సమీప భవిష్యత్తులోనే రూపాయి విలువ 80 దిగువునకు పడిపోవడం ఖాయమని చెప్పారు.

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం రావచ్చన్న భయాలతో అమెరికా డాలర్ విలువ రెండు దశాబ్ధాల కనిష్ఠ స్థాయికి చేరింది. దీంతో భారత కరెన్సీతో పాటు పలు దేశాల కరెన్సీ విలువలు క్షీణిస్తున్నాయి. విదేశీ మదుపర్లు నష్టాల భయంతో తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకుంటున్నారు. రూపాయి మారకం విలువ క్షీణించానికి ఇది ప్రధాన కారణం అవుతోంది.

ఇవి కూడా చదవండి

రూపాయి క్షీణిత ప్రభావం ఇలా..

2017లో డాలర్ విలువతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.64గా ఉండగా.. ఇప్పుడు దాదాపు రూ.80కి పడిపోవడం భారత పారిశ్రామిక వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. రూపాయి క్షీణిత దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యులపై కూడా ప్రభావం చూపనుంది. రూపాయి విలువ క్షీణితతో దిగుమతి చేసుకునే వస్తువల ధరలు మరింత పెరగనున్నాయి. తద్వారా దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లు, బైకులు, కార్ల విడిభాగాలు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డిజిటన్ కెమరాలు, ఎల్‌ఈడీ టీవీ ధరలపై ప్రభావం ఉంటే అవకాశముంది.

రూపాయి క్షీణితతో ముడి చమురుకు భారత్ మరింత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఆ భారం పరోక్షంగా ప్రజలపై పడుతుంది. దీంతో డీజిల్, పెట్రోల్ ధరలు మరింత ప్రియం అవుతాయి. అలాగే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచితే బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో రుణగ్రహీతులు చెల్లించే ఈఎంఐలు పెరిగే అవకాశముంది.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్