Gold Smuggling: దిగుమతి సుంకాన్ని భారీగా పెంచిన ప్రభుత్వం.. గోల్డ్ స్మగ్లింగ్ పెరిగే ఛాన్స్ ఉందంటోన్న నిపుణులు..

భారత్‌లో దిగుమతి సుంకం పెరగడంతో, దుబాయ్‌తో పోల్చితే దేశంలో బంగారం ధరలో కిలోకు సుమారు 7 లక్షల రూపాయల వ్యత్యాసం ఉంది. ఇది దేశంలో స్మగ్లింగ్‌ను ప్రోత్సహించగలదంటూ నిపుణులు అంటున్నారు.

Gold Smuggling: దిగుమతి సుంకాన్ని భారీగా పెంచిన ప్రభుత్వం.. గోల్డ్ స్మగ్లింగ్ పెరిగే ఛాన్స్ ఉందంటోన్న నిపుణులు..
Gold Price
Follow us
Venkata Chari

|

Updated on: Jul 12, 2022 | 12:01 PM

Import Duty on Gold: బంగారంపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం గతవారం పెంచింది. బంగారం దిగుమతులను తగ్గించడం.. వాణిజ్య లోటును నియంత్రించడం.. అదేవిధంగా రూపాయి పతనాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పేర్కొంది. మే నెలలో దేశంలో 107 టన్నుల బంగారం దిగుమతులు జరిగాయి. ఎంత భారీగా దిగుమతి జరగడంతో ప్రభుత్వ ఆందోళనను పెంచింది. ఈ ఆందోళనకు పరిష్కరంగా దిగుమతి సుంకం పెంచడమనే మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంది. ఇలా దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా దిగుమతులకు ప్రభుత్వం పగ్గాలు వేయాలనుకుంటోంది. గతంలో బంగారంపై 11 శాతం దిగుమతి సుంకం ఉండేది. ఇది ఇప్పుడు 15 శాతానికి పెరిగింది.

వాణిజ్య లోటు, రూపాయి పతనం చూస్తుంటే బంగారంపై దిగుమతి సుంకం పెంపు నిర్ణయం కూడా సమర్థనీయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే, వాణిజ్య లోటు, రూపాయి పతనం రెండిటి విషయంలోనూ బంగారానిది పెద్ద పాత్రే ఉంటుంది. జూన్‌లో బంగారం దిగుమతుల్లో 169 శాతం జంప్ కనిపించింది. అదేవిధంగా 2.61 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన బంగారం దిగుమతి అయింది. పెరిగిన వాణిజ్య లోటు కారణంగా, రూపాయి ఆరోగ్యం క్షీణిస్తోంది. ప్రస్తుతం డాలర్ విలువ రూ. 79.40 పైన పెరిగింది.

కానీ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఇబ్బందిని పెంచింది. దిగుమతి సుంకం పెరిగిన తరువాత బంగారం ధర దాదాపు 1500 రూపాయలు పెరిగింది. కామోడీటీ ఎక్స్చేంజ్ అలాగే MCX లో దిగుమతి సుంకం పెంచక ముందు బంగారం ధర దాదాపు రూ.50,600 ఉండేది. తర్వాత అది 52100 రూపాయలను దాటింది.

ఇవి కూడా చదవండి

అధిక దిగుమతి సుంకం వల్ల బంగారం స్మగ్లింగ్ పెరిగిపోతుందని ఇండియన్ బులియన్ జువెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి కుమార్ జైన్ అన్నారు. ఇండియన్ కరెన్సీలో చూస్తే, దుబాయ్‌లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 46,500 రూపాయలు.. అదే భారతదేశంలో ధర 53,500 రూపాయలు. అంటే కిలోకు దాదాపు 7 లక్షల రూపాయలు తేడా ఉంది. విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ఈ మొత్తం సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

దిగుమతి సుంకం పెంపుదల కారణంగా బంగారం ధర పెరిగింది. ఇది నగల డిమాండ్‌పై కూడా ప్రభావం చూపుతుంది. కరోనావైరస్ ప్రభావం నుంచి కోలుకోవడంతో, దేశంలోని ఆభరణాల పరిశ్రమ పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారంలో వృద్ధిని ఆశించింది. అయితే బంగారం ధర పెరగడంతో ఆభరణాల వ్యాపారం దెబ్బతింటుంది.

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు