RBI: నిబంధనలు పాటించనందున ఆ మూడు బ్యాంకులకు షాకిచ్చిన రిజర్వ్‌ బ్యాంకు

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. సోమవారం నాసిక్ మర్చంట్స్ కోఆపరేటివ్..

RBI: నిబంధనలు పాటించనందున ఆ మూడు బ్యాంకులకు షాకిచ్చిన రిజర్వ్‌ బ్యాంకు
Rbi
Follow us
Subhash Goud

|

Updated on: Jul 12, 2022 | 12:29 PM

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. సోమవారం నాసిక్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్‌తో సహా మూడు సహకార బ్యాంకులపై రెగ్యులేటరీ సమ్మతిలో లోపాల కారణంగా జరిమానా విధించింది. ఫ్రాడ్ రిపోర్టింగ్, పర్యవేక్షణకు సంబంధించి జారీ చేసిన నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) ఆదేశాలను పాటించనందుకు, ముంబైలోని మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌కి రూ.37.50 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సహకార బ్యాంకుకు 50 లక్షల జరిమానా విధించారు. అలాగే నాసిక్ మర్చంట్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇతర బ్యాంకుల్లో డిపాజిట్ల ప్లేస్‌మెంట్, డిపాజిట్లపై వడ్డీకి సంబంధించి ఆర్‌బీఐ ఆదేశాలను పాటించనందుకు రూ.50 లక్షల జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ మరో ప్రకటనలో తెలిపింది.

నేషనల్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బెట్టియా, బీహార్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్, నో యువర్ కస్టమర్ రూల్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.2 లక్షల జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. రెగ్యులేటరీ సమ్మతిలో లోపాల కారణంగా ఈ పెనాల్టీ విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు..

రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు గతంలో ఆర్‌బీఐ ఫెడరల్ బ్యాంక్‌పై రూ.5.72 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ.70 లక్షలు పెనాల్టీ విధించింది. ఈ మేరకు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. నో యువర్ ఎంప్లాయీ నిబంధనలు, రెగ్యులేటరీ సమ్మతి కొన్ని నిబంధనలకు సంబంధించి ఆదేశాలను పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియాపై RBI రూ. 70 లక్షల పెనాల్టీని విధించిందని పేర్కొంది.

ఇన్సూరెన్స్ బ్రోకింగ్/కార్పొరేట్ ఏజెన్సీ సేవలలో నిమగ్నమైన తన ఉద్యోగులకు బీమా కంపెనీ ఏదైనా ప్రోత్సాహకం (నగదు లేదా నగదు రహిత) అందించిందో లేదో నిర్ధారించడంలో బ్యాంక్ విఫలమైందని ఫెడరల్ బ్యాంక్ గురించి ప్రత్యేక ప్రకటనలో RBI పేర్కొంది. ఆర్‌బీఐ మార్చి 31, 2020 నాటికి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి మానిటరింగ్ అసెస్‌మెంట్ (ISE) కోసం చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది.

అంతకుముందు, ప్రైవేట్ రంగ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్‌బీఐ గత వారం పెద్ద చర్య తీసుకుంది. కోటక్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ రూ.1 కోటి 5 లక్షల జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో జాప్యం కారణంగా ఈ జరిమానా విధించబడింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్