NASA Space Telescope: అద్భుతం.. వెబ్‌ టెలిస్కోప్‌ తొలి చిత్రాన్ని విడుదల చేసిన జో బైడెన్‌

NASA Webb Telescope Images: ప్రపంచ వ్యాప్తంగా ఎందగానో ఎదురు చూస్తున్న వెబ్‌ టెలిస్కోప్‌ తొలి కలర్‌ఫోటో వచ్చేసింది. గెలాక్సీకి సంబంధించిన వెబ్‌ టెలిస్కోప్‌ తీసిన ఈ ఫోటోను అమెరికా..

NASA Space Telescope: అద్భుతం.. వెబ్‌ టెలిస్కోప్‌ తొలి చిత్రాన్ని విడుదల చేసిన జో బైడెన్‌
Nasa Webb Telescope Images
Follow us
Subhash Goud

|

Updated on: Jul 12, 2022 | 12:00 PM

NASA Webb Telescope Images: ప్రపంచ వ్యాప్తంగా ఎందగానో ఎదురు చూస్తున్న వెబ్‌ టెలిస్కోప్‌ తొలి కలర్‌ఫోటో వచ్చేసింది. గెలాక్సీకి సంబంధించిన వెబ్‌ టెలిస్కోప్‌ తీసిన ఈ ఫోటోను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిష్‌ వైట్‌హౌస్‌లో ఆవిష్కరించారు. ఈ ఒక్కఫోటోలో వేలకొద్ది గెలాక్సీలు, ఇప్పటి వరకు ఎవ్వరికి కనిపించని వస్తువులు ఉన్నాయి. ఇదొక చారిత్రక రోజు అని జోబైడెన్‌ అన్నారు. విశ్వంలోనే ఇదొక కొత్త అధ్యయనంగా అభివర్ణించారు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌. అయితే నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఎజెన్సీ, కెనేడియన్‌ స్పెస్‌ ఎజెన్సీల సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ వెబ్‌ టెలిస్కోప్‌ తొలి కలర్‌ఫోటో ఆవిష్కృతమైంది.

ఈ సందర్భంగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ.. వెబ్‌ టెలిస్కోప్ నుంచి విడుదలైన తొలి చిత్రం ఇదే అని, ఇప్పుడు మనం 13 బిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలో మీరు చూస్తున్న కాంతి 1300 కోట్ల సంవత్సరాలుగా ప్రయాణిస్తూనే ఉందని, ఈ టెలిస్కోప్ మరెన్నో రహస్యాలను ఛేదించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే వెబ్‌ టెలిస్కోప్‌కు తీసిన ఐదు కాస్మిక్‌ టార్గెట్లకు సంబంధించిన ఫోటోలను గత శుక్రవారం విడుదల చేయగా, తాజాగా గెలాక్సీకి సంబంధించిన తొలి కలర్‌ ఫోటో ఇప్పుడు ఆవిష్కృతమైంది.

ఇవి కూడా చదవండి

ఈ వెబ్‌ టెలిస్కోప్‌ను నాసా గత ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసింది. పది సంవత్సరాల పాటు పని చేయాల్సి ఉంటుంది. 20 ఏళ్ల పాటు పని చేసేందుకు కావాల్సిన ఇంధనం ఈ వెబ్‌ టెలిస్కోప్‌లో ఉందని నాసా వెల్లడిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి