Elon Musk: ట్విట్టర్‌తో లీగల్ వార్.. ఎలాన్ మస్క్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
Elon Musk: ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేస్తూ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంతలో, ట్విట్టర్..
Elon Musk: ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేస్తూ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంతలో, ట్విట్టర్ కూడా ఎలాన్ మస్క్‌పై న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. దీంతో ఎలాన్ మాస్క్ ట్విట్టర్‌కు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎలాన్ మస్క్‌పై చట్టపరమైన చర్య తీసుకోవడానికి ట్విట్టర్ న్యూయార్క్‌లోని అతిపెద్ద చట్టపరమైన సంస్థ వాచెల్, లిప్టన్, రోసెన్ అండ్ కాట్జ్ LLPని నియమించుకుంది.
వాస్తవానికి, ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను $ 44 బిలియన్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. అయితే తర్వాత ఎలాన్ మస్క్ దానిని రద్దు చేశాడు. ఒప్పందం తర్వాత అనేక ఉల్లంఘనల కారణంగా ఒప్పందాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు మస్క్ చెప్పుకొచ్చారు. ట్విటర్‌లో 5 శాతం కంటే ఎక్కువ స్పామ్, ఫేక్ ఖాతాలు ఉన్నాయని టెస్లా సీఈఓ మస్క్ బృందం అభిప్రాయపడింది. ఎలాన్ మస్క్ జారీ చేసిన లేఖలో ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎందుకంటే ఒప్పందంలో చేర్చబడిన అనేక నిబంధనలను ట్విట్టర్ ఉల్లంఘిస్తోందని అన్నారు.
విభేదాలు ఎందుకు మొదలయ్యాయి?
ఏప్రిల్ 13న మస్క్ ట్విట్టర్ కొనుగోలును ప్రకటించి ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ఒక్కో షేరుకు $54.2 చొప్పున $44 బిలియన్లకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేయడానికి అతను ప్రతిపాదించాడు. ఏప్రిల్ 13న ఫైలింగ్ లో ఈ విషయం వెల్లడైంది. అయితే మే 13న ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ ను హోల్డ్‌లో పెట్టాడు. దీనికి కారణం స్పామ్, నకిలీ ఖాతాలు. మే ప్రారంభంలో ఒక SEC ఫైలింగ్‌లో ప్లాట్‌ఫారమ్‌లో కేవలం 5 శాతం మందికి మాత్రమే స్పామ్ ఖాతాలు ఉన్నాయని ట్విట్టర్ తెలిపింది. ఈ విషయంలో ట్విట్టర్, మస్క్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీంతో ట్విట్టర్‌తో లీగర్ వార్ కొనసాగుతోంది.
జూలై 8న మస్క్ ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకున్నాడు. ట్విటర్‌లో నకిలీ ఖాతాల గురించి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపిస్తూ ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు మస్క్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి