AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthi Suresh: ఆ కారణంతో మణిరత్నం సినిమాకు కీర్తి నో చెప్పిందా ?.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్..

డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కీర్తి పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Keerthi Suresh: ఆ కారణంతో మణిరత్నం సినిమాకు కీర్తి నో చెప్పిందా ?.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్..
Keerthy Suresh
Rajitha Chanti
|

Updated on: Jul 11, 2022 | 12:42 PM

Share

నేను శైలజ అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించి.. మహానటి సినిమాతో ప్రశంసలు అందుకుంది హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh). ఈ మూవీలో కీర్తి సురేష్ మహానటి సావిత్రిని మైమరపించందనడంలో సందేహం లేదు. ఇందులో ఆమె నటనకు ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది కీర్తి. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ అతి తక్కవ సమయంలోనే స్టార్ హీరోయిన్‏‏గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటించింది. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కీర్తి పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకో తెలుసుకుందామా.

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ రూపొందించిన ఆయన ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ పాడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో పొన్నియన్ సెల్వన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాయ్, త్రిష, విక్రమ్, కార్తి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అయితే ముందుగా ఈ మూవీలో యువరాణి కుందవై పాత్ర కోసం కీర్తిని సంప్రదించారట. కానీ డేట్స్ లేవంటూ మణిరత్నం ఆఫర్ రిజెక్ట్ చేసిందంట. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో నెటిజన్స్ ఆమె తీరుపై ఫైర్ అవుతున్నారు. మహానటి తర్వాత ఒక్కహిట్ కూడా లేని అమెకు మణిరత్నం వంటి స్టార్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తే వదులుకుంటుందా ?.. చాలా తెలివి తక్కువగా వ్యవహరించందంటూ ట్రోల్ చేస్తున్నారు. కొందరు మాత్రం కీర్తి సురేష్ తీసుకున్న నిర్ణయానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమాలో యువరాణి కుందవై పాత్ర కోసం కీర్తిని ఎంపిక చేయగా.. ఆమె రిజెక్ట్ చేసిందట. దీంతో ఆ పాత్ర కోసం త్రిషను సెలక్ట్ చేశారట. ఇటీవల విడుదలైన త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.