Shruti Haasan: పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ? నెటిజన్ ప్రశ్నకు శ్రుతిహాసన్ షాక్.. కౌంటర్ మాములుగా లేదుగా..
"ప్రియమైన మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ? " అంటూ ప్రశ్నించాడు. దీంతో శ్రుతి వెంటనే తన ముఖంపై ముసుగు కప్పేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Haasan) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మెగా 154, ఎన్బీకే 107, సలార్ చిత్రీకరణలో పాల్గోంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం శ్రుతి ఫుల్ యాక్టివ్. వ్యక్తిగత ఫోటోస్ షేర్ చేస్తూ..అప్పుడప్పుడు ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది. అభిమానులతో చిట్ చాట్ నిర్వహిస్తూ వారు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెబుతుంటుంది. తాజాగా ఓ నెటిజన్ నుంచి మరోసారి పెళ్లి ప్రశ్నలు ఎదుర్కొంది శ్రుతి హాసన్.
ఇటీవల ఇన్ స్టాలో శ్రుతి ఫాలోవర్లతో చిట్ చాట్ నిర్వహించింది. అందులో ఓ నెటిజన్.. “ప్రియమైన మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ? ” అంటూ ప్రశ్నించాడు. దీంతో శ్రుతి వెంటనే తన ముఖంపై ముసుగు కప్పేసింది. మీరందరూ ఎప్పుడు ఈ ప్రశ్న అడగడం మానేస్తారు అంటూ సమాధానమిచ్చింది. గతంలోనూ చాలా సందర్భాల్లో ఆమెను పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా అడిగారు నెటిజన్స్. ఇక ఇటీవల శ్రుతి హాసన్ ఆరోగ్యం పట్ల రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. ఇంట్లోనే ఉన్నానంటూ ఆ వార్తలను ఖండించింది శ్రుతి. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ సరసన సలార్ సినిమాలో ఆద్య పాత్రలో నటిస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.