EPFO: 73 లక్షల మంది పెన్షనర్లకు శుభవార్త.. ఈపీఎఫ్ సంచలన నిర్ణయం..!
EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) జూలై 29, 30 తేదీల్లో జరిగే సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర పెన్షన్ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసే..
EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) జూలై 29, 30 తేదీల్లో జరిగే సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర పెన్షన్ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించి, ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో 73 లక్షలకు పైగా పెన్షన్ జమ చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. భారతదేశం అంతటా పెన్షనర్ల బ్యాంకు ఖాతాలు ఒకేసారి డబ్బులు జమ కానున్నాయి. ప్రస్తుతం EPFO కు చెందిన 138 ప్రాంతీయ కార్యాలయాలు లబ్ధిదారులకు వేర్వేరుగా పెన్షన్‌లను అందజేస్తున్నాయి. అందరికి ఒకేసారి అందించవు. వివిధ ప్రాంతీయ కార్యాలయాల పెన్షనర్లు వేర్వేరు రోజులలో పెన్షన్లను అందుకుంటున్నారు. ఈ నిర్ణయం అమలైతే అందరికి ఒకేసారి పెన్షన్ అందనుంది.
EPFO యొక్క అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ముందు ఈ ప్రతిపాదన ఉంచబడుతుంది. సెంట్రల్ పెన్షన్ డిస్బర్సల్ సిస్టమ్ 138 ప్రాంతీయ కార్యాలయాల డేటాను ఉపయోగిస్తుందని, ఆపై ఒకేసారి 73 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ విడుదల చేయవచ్చని కేంద్రం భావిస్తోంది.
అన్ని ప్రాంతీయ కార్యాలయాలు తమ ప్రాంతంలోని పెన్షనర్ల అవసరాలకు భిన్నంగా వ్యవహరిస్తాయని నివేదిక తెలిపింది. దీంతో పింఛనుదారులు వేర్వేరు రోజుల్లో పింఛన్ చెల్లించే అవకాశం ఉంది. నవంబర్ 20, 2021న జరిగిన CBT 229వ సమావేశంలో C-DAC ద్వారా కేంద్రీకృత IT ఆధారిత వ్యవస్థ అభివృద్ధి ప్రతిపాదనను అధికారులు ఆమోదించారు. దీని తర్వాత ప్రాంతీయ కార్యాలయాల వివరాలను దశలవారీగా కేంద్ర డేటాబేస్‌కు బదిలీ చేస్తామని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని 138కి పైగా ప్రాంతీయ కార్యాలయాల సెంట్రల్ డేటాబేస్‌ను ఉపయోగించి పెన్షన్ పంపిణీ చేయబడుతుంది. ఈ నిర్ణయంతో 73 లక్షల మందికి పైగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ జమ చేయడం సులభతరం కానుంది.
నివేదిక ప్రకారం..
అయితే పెన్షన్ జమ అయిన ఖాతాలో అకౌంట్ నుంచి డిపాజిట్లను ఉపసంహరించుకోవడానికి అనుమతించే విషయమై సీబీటీ పరిశీలిస్తోంది. ఆరు నెలల నుండి 10 సంవత్సరాల వరకు చందా చేసిన వారి పెన్షన్ ఖాతాల నుండి డబ్బుల ఉపసంహరణకు మాత్రమే అర్హత ఉండేది. అయితే ఈ నిర్ణయం అమలు అయినట్లయితే ఆరు నెలల లోపు కూడా ఖాతా నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి