Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన.. మెచ్యూరిటీకి ముందు ఖాతాను ఎలా మూసివేయాలి.. డిపాజిట్‌ చేయకపోతే ఏమవుతుంది?

Sukanya Samriddhi Yojana: భారత ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ది యోజన పథకం. ఆడ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది..

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన.. మెచ్యూరిటీకి ముందు ఖాతాను ఎలా మూసివేయాలి.. డిపాజిట్‌ చేయకపోతే ఏమవుతుంది?
Sukanya Samriddhi Yojana
Follow us
Subhash Goud

|

Updated on: Jul 09, 2022 | 4:14 PM

Sukanya Samriddhi Yojana: భారత ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ది యోజన పథకం. ఆడ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ అనేది ఒక డిపాజిట్‌ పథకం. దీనిని ప్రభుత్వం ‘సేవ్‌ దిగ గర్ల్‌ చైల్డ్‌’ లేదా ‘బేటీ బచావో బేటీ పడావో’ ప్రచారంలో భాగంగా ప్రారంభించింది. ఆడ పిల్లలున్న తల్లిదండ్రులకు ఈ పథకం ఒక వరమనే చెప్పాలి. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు, పోస్టాఫీసుల్లో ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ)లో కూడా అకౌంట్‌ను ఓపెన్‌ చేసుకోవడం సులువే. ఈ పథకంలో 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అంతేకాకుండా ఈ పథకం కింద ఆదాయపు పన్ను రాయితీ ప్రయోజనాలను అందిస్తోంది. ఇది ఆదాయపు పన్ను 1961లోని సెక్షన్‌ 80C కింద ఆదాయపు పన్ను రాయితీని ఇస్తుంది. అలాగే పథకం కింద రిటర్న్‌లు అలాగే మెచ్యూరిటీ స్కీమ్‌లు పన్ను నుంచి మినహాయించబడ్డాయి. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఒక అమ్మాయి పుట్టిన తర్వాత ఆమెకు 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు సంరక్షకుడు ఎప్పుడైనా ఖాతా తెరవవచ్చు. ఏదైనా పోస్టాఫీసు, లేదా వాణిజ్య బ్యాంకుల అధీకృత శాఖలలో అకౌంట్‌ను ఓపెన్‌ చేయవచ్చు.

సుకన్య సమృద్ధి ఖాతాను ఎలా ఓపెన్ చేయాలి..?

ప్రభుత్వం డిసెంబర్‌ 2019లో నోటిఫికేషన్‌ ద్వారా ఈ పథకానికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేసింది. దీని కింద సుకన్య సమృద్ధి ఖాతాను ఆమె పుట్టినప్పటి నుంచి ఆమెకు 10 ఏళ్లు వచ్చే వరకు ఆమె పేరుపై సంరక్షకులు ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. అలాగే ఈ పథకం కింద ఆడపిల్లల కోసం ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది. నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో ఇద్దరు ఆడ పిల్లలకు గరిష్టంగా రెండు ఖాతాలు తెరవవచ్చు. ఖాతా తెరిచిన అమ్మాయి పేరు మీద పుట్టిన సర్టిఫికేట్, డిపాజిటర్ గుర్తింపు, నివాస ధృవీకరణకు సంబంధించిన ఇతర పత్రాలతో పాటు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్‌లో ఖాతా తెరిచే సమయంలో సంరక్షకుడు సమర్పించాలి.

ఇవి కూడా చదవండి

ఖాతా కోసం కనీస, గరిష్ట బ్యాలెన్స్ అవసరం

ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం రూ. 250 ప్రారంభ డిపాజిట్‌తో ఖాతాను తెరవవచ్చు. ఆ తర్వాత, రూ.50 గుణకారంలో ఏదైనా మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 డిపాజిట్ చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో ₹ 1,50,000 మించకూడదు. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాల వ్యవధి వరకు ఖాతాలో డిపాజిట్లు చేయవచ్చు. అందుకే తొమ్మిదేళ్ల పిల్లలకు 24 ఏళ్లు వచ్చే వరకు డిపాజిట్లు కొనసాగించాలి. సుకన్య సమృద్ధి పెట్టుబడి 21 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. అయితే డిపాజిట్లు 15 సంవత్సరాల వరకు మాత్రమే చేయబడతాయి. ఆడపిల్లకు తొమ్మిదేళ్ల వయసులో ఖాతా తెరిచి ఉంటే ఆమెకు 30 ఏళ్లు వచ్చేసరికి అది మెచ్యూర్ అవుతుంది. అందువల్ల 24, 30 సంవత్సరాల మధ్య (ఖాతా మెచ్యూర్ అయినప్పుడు) ఖాతా బ్యాలెన్స్‌పై వడ్డీని పొందుతూనే ఉంటారు.

మెచ్యూరిటీకి ముందు ఖాతాను ఎలా మూసివేయాలి?

సుకన్య సమృద్ధి యోజనలో మెచ్యూరిటీకి ముందే ఖాతాను మూసివేసే సదుపాయం అందుబాటులో ఉంది. ఖాతాను ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత, మీరు దానిని మూసివేసి, డిపాజిట్ చేసిన డబ్బును తీసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. ఖాతాదారుడు మరణిస్తే ఖాతాను మూసివేయవచ్చు. కొన్ని ప్రతికూల పరిస్థితులలో ఖాతాను మూసివేసే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఖాతాదారుడి కుమార్తె ప్రాణాంతక అనారోగ్యంతో ఉంటే, ఖాతాను నడుపుతున్న సంరక్షకుడు మరణిస్తే ఖాతాను మూసివేయవచ్చు. అటువంటి పరిస్థితిలో ఖాతాను మూసివేయడానికి అన్ని పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఖాతా నడుస్తున్న పోస్టాఫీసులో దరఖాస్తును సమర్పించడం ద్వారా ఖాతాను మూసివేయడానికి అభ్యర్థన ఇవ్వాలి.

మెచ్యూరిటీలో ఖాతాను ఎలా మూసివేయాలి?

మెచ్యూరిటీ తర్వాత సుకన్య సమృద్ధి యోజన ఖాతా మూసివేయబడుతుంది. దీని మెచ్యూరిటీ 21 ఏళ్లలో ఉంటుంది. కూతురి పెళ్లి సమయంలో కూడా పూర్తి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. కుమార్తె వయస్సు 18 సంవత్సరాలు దాటితే, మీరు వివాహం కోసం పథకం పూర్తి డబ్బు తీసుకోవచ్చు. పెళ్లికి ఒక నెల ముందు లేదా పెళ్లి తేదీ నుండి 3 నెలల తర్వాత ఖాతాను పూర్తిగా మూసివేయవచ్చు.

డిపాజిట్‌ చేయకపోతే ఖాతా డిఫాల్ట్‌

అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస మొత్తం రూ. 250 డిపాజిట్ చేయకపోతే అది డిఫాల్ట్ ఖాతా అవుతుంది. కనిష్ట డిపాజిట్ రూ. 250, ప్రతి సంవత్సరానికి అదనంగా రూ. 50 పెనాల్టీ మొత్తం చెల్లించడం ద్వారా డిఫాల్ట్ అయిన మొత్తాన్ని 15 సంవత్సరాలు పూర్తి చేయడానికి ముందు పునరుద్ధరించవచ్చు .

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి