PF Fund Transfer: కొత్త ఖాతాకు పాత పీఎఫ్‌ నిధులను బదిలీ చేయడం ఎలా..?

PF Fund Transfer: ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఖాతాదారుల సౌలభ్యం కోసం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఇక ఉద్యోగులు..

PF Fund Transfer: కొత్త ఖాతాకు పాత పీఎఫ్‌ నిధులను బదిలీ చేయడం ఎలా..?
Follow us
Subhash Goud

|

Updated on: Jul 06, 2022 | 5:35 PM

PF Fund Transfer: ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఖాతాదారుల సౌలభ్యం కోసం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఇక ఉద్యోగులు తరుచుగా కంపెనీలు మారుతుంటారు. అలాంటి సమయంలో కొత్త పీఎఫ్‌ ప్రారంభమవుతుంది. అలాంటి సమయంలో పాత కంపెనీలో ఉన్న పీఎఫ్‌ అకౌంట్‌ను కొత్త కంపెనీకి మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు PF బ్యాలెన్స్‌ని బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. పాత కంపెనీ పీఎఫ్‌ను కొత్త కంపెనీకి మార్చడం మర్చిపోతే తర్వాత ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి సమయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా పీఎఫ్‌ కార్యాలయం చుట్టు తిరగకుండానే ఆ పనిని సులభం పూర్తి చేసుకోవచ్చు. మీరు ఉద్యోగం చేసే కంపెనీలు మారినప్పటికీ మీ PF బ్యాలెన్స్‌ను పాత కంపెనీ నుంచి మీ ప్రస్తుత కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. గతంలో పాత పీఎఫ్‌ను కొత్త పీఎఫ్‌కు బదిలీ చేయాలంటే మీ పాత కంపెనీ చుట్టు తిరగాల్సిన వస్తుండేది. కానీ టెక్నాలజీ పెరిగిన కారణంగా ఈ ప్రక్రియ మరింత సులభంగా మారిపోయింది.

పాత EPF బ్యాలెన్స్‌ను కొత్త ఖాతాకు బదిలీ చేయడానికి మీ UAN నంబర్, పాస్‌వర్డ్‌ యాక్టివ్‌గా ఉండాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. దీంతో పాటు మీ UAN నంబర్‌లో బ్యాంక్ ఖాతా నంబర్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ వంటి అన్ని వివరాలు అప్‌డేట్‌ అయి ఉండాలి.

PF ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయండి..?

ఇవి కూడా చదవండి

ముందుగా EPFO అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లండి. తర్వాత UAN నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. తర్వాత హోమ్ పేజీలోకి వెళ్తుంది. ఇక్కడ సభ్యుల ప్రొఫైల్‌లోకి వెళ్లి మీ వ్యక్తిగత వివరాలను తనిఖీ చేయండి. మీ పేరు, ఆధార్ వివరాలు, పాన్ కార్డ్ ధృవీకరించాలి. ఈ మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. PF బదిలీ చేయడానికి ముందు మీరు మీ పాస్‌బుక్‌ని తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పాస్‌బుక్ కనిపించే వ్యూలోకి వెళ్లాలి. పాస్‌బుక్‌పై క్లిక్ చేసిన తర్వాత మీరు మరోసారి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎంచుకున్న సభ్యుల ఐడిపై క్లిక్ చేయాలి. వెంటనే పూర్తి జాబితా కనిపిస్తుంది. మీరు పనిచేసిన అన్ని కంపెనీల సభ్యుల IDలు కనిపిస్తాయి. దిగువన ఉన్న ID మీ ప్రస్తుత కంపెనీకి చెందినదిగా భావించాలి. ఇక్కడ పాస్‌బుక్‌ని చూసి మీ అన్ని కంపెనీలలో PF బ్యాలెన్స్‌ని తెలుసుకోండి.

పాత పీఎఫ్‌ అమౌంట్‌ను కొత్త అకౌంట్‌కు బదిలీ చేయడం ఎలా..?

మీ పాత పీఎఫ్‌ అమౌంట్‌ను కొత్త పీఎఫ్‌ అకౌంట్‌కు బదిలీ చేసే ముందు కంపెనీలో ఉద్యోగం కోసం జాయిన్‌ అయిన తేదీ, తర్వాత మీరు నిష్క్రమణ తేదీని అప్‌డేట్ చేసిందో లేదో తెలుసుకోవాలి. దీని కోసం మీరు సర్వీస్ చరిత్ర ఎంపికపై క్లిక్ చేయాలి. పాత కంపెనీ రెండింటి తేదీలను అప్‌డేట్ చేసినట్లయితే మీ PF సులభంగా బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆన్‌లైన్ సేవలకు వెళ్లి వన్ మెంబర్ వన్ ఈపీఎఫ్ ఖాతా (బదిలీ అభ్యర్థన)పై క్లిక్ చేయాలి. మీ వ్యక్తిగత సమాచారం, ఇప్పటికే ఉన్న కంపెనీ PF ఖాతా వివరాలను పొందే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

పీఎఫ్‌ బదిలీ చేయడానికి పాత యజమాని వివరాలు ఉంటాయి. మీరు బదిలీ చేయబోయే పీఎఫ్‌ ప్రస్తుత లేదా పాత యజమాని ఆమోదించాలని గుర్తుంచుకోండి. తర్వాత మీరు మీ UAN వివరాలను ఎంటర్‌ చేయాలి. దీన్ని చేసిన వెంటనే మీ మునుపటి అన్ని కంపెనీల PF ID వస్తుంది. డబ్బును బదిలీ చేయాలనుకుంటున్న ఐడీని ఎంచుకోండి. ఆ తర్వాత మీరు దానిని OTP ద్వారా ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. GET OTPపై క్లిక్ చేయండి. మీరు ఇక్కడ క్లెయిమ్ విజయవంతం అయినట్లు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ధృవీకరణ కోసం మీరు ప్రింట్ తీసి మీ కంపెనీకి ఇస్తే సరిపోతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?