SBI Toll Free Numbers: మీకు ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా..? ఈ టోల్‌ ఫ్రీ నెంబర్లతో 5 సమస్యలు పరిష్కరించుకోవచ్చు

SBI Toll Free Numbers: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. బ్యాంకులకు..

SBI Toll Free Numbers: మీకు ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా..? ఈ టోల్‌ ఫ్రీ నెంబర్లతో 5 సమస్యలు పరిష్కరించుకోవచ్చు
Follow us
Subhash Goud

|

Updated on: Jul 06, 2022 | 3:54 PM

SBI Toll Free Numbers: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. బ్యాంకులకు వెళ్లకుండానే ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌ ద్వారా పలు సర్వీసులను ప్రవేశపెడుతోంది. మీరు ఇంట్లోనే ఉండి మీ మొబైల్‌లో బ్యాంకుకు సంబంధించిన ఐదు సౌకర్యాలను పొందవచ్చు. ఈ మేరకు స్టేట్‌ బ్యాంక్‌ ఒక ట్వీట్‌ ద్వారా సమాచారం అందించింది. స్టేట్ బ్యాంక్ దీని కోసం ఒక నంబర్‌ను జారీ చేసింది. టోల్‌ ప్రీ నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా కస్టమర్ సేవకు సంబంధించిన సౌకర్యాలను పొందవచ్చు. బ్యాంకుకు సంబంధించిన పనుల కోసం ఖాతాదారులు బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీంతో తాజాగా స్టేట్ బ్యాంక్ రెండు టోల్ ఫ్రీ నంబర్లను జారీ చేసింది. ఈ నంబర్లకు కాల్ చేయడం ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు.

బ్యాంకులకు సెలవు రోజున కూడా టోల్ ఫ్రీ నంబర్‌కు పని చేస్తుంది. రెండో శనివారం, ఆదివారాలు సెలవులు అయితే ఈ రోజుల్లో కూడా టోల్‌ ఫ్రీ నెంబర్ పని చేస్తుంది. సెలవు రోజుల్లో కూడా టోల్‌ ఫ్రీ నెంబర్‌ పని చేస్తుందన్నట్లు. బ్యాంకు టోల్‌ ప్రీ నెంబర్‌1800 1234 లేదా 1800 2100కు కాల్ చేయడం ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ సహాయంతో 5 ముఖ్యమైన పనులు చేయవచ్చు.

☛ ఖాతా బ్యాలెన్స్, చివరి 5 లావాదేవీ వివరాలు

ఇవి కూడా చదవండి

☛ ATM కార్డ్ బ్లాకింగ్ స్టేటస్, ATM కార్డ్ డిస్పాచ్

☛ పాత ATM కార్డ్ బ్లాక్ చేయబడిన తర్వాత కొత్త కార్డ్ కోసం అభ్యర్థన

☛ చెక్‌బుక్ పంపే స్థితి

☛ TDS వివరాలు, ఇమెయిల్ ద్వారా డిపాజిట్ సర్టిఫికేట్

☛ SBI 24X7 హెల్ప్‌లైన్ నంబర్‌లను ట్వీట్‌లో పొందుపర్చింది. అవి 1800 1234 (టోల్-ఫ్రీ), 1800 11 2211 (టోల్-ఫ్రీ), 1800 425 3800 (టోల్-ఫ్రీ), 1800 21000 (Toll-Free-2990 పై దేశంలోని అన్ని ల్యాండ్‌లైన్‌లు, మొబైల్ ఫోన్‌ల నుండి ఈ టోల్ ఫ్రీ నంబర్‌లు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి