AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Rate Hike: సామాన్యులకు షాకిచ్చిన కేంద్రం.. ఈ ఉత్పత్తులపై జీఎస్టీ మోత.. పెరగనున్న ధరలు..!

GST Rate Hike: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన గత నెల 27, 28 తేదీల్లో జీఎస్టీ కౌన్సి్‌ల్‌ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో..

GST Rate Hike: సామాన్యులకు షాకిచ్చిన కేంద్రం.. ఈ ఉత్పత్తులపై జీఎస్టీ మోత.. పెరగనున్న ధరలు..!
Subhash Goud
|

Updated on: Jul 04, 2022 | 8:38 PM

Share

GST Rate Hike: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన గత నెల 27, 28 తేదీల్లో జీఎస్టీ కౌన్సి్‌ల్‌ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో పలు ఉత్పత్తులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు ఉత్పత్తులపై జీఎస్టీ రేటుకు సంబంధించి కేంద్రం పెద్ద నిర్ణయం తీసుకుంది. మీరు ప్యాక్ చేసిన ఉత్పత్తులను ఉపయోగిస్తే, ఆ ఉత్పత్తులపై మీరు ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోండి. క్యాన్డ్ లేదా ప్యాక్ చేసి లేబుల్ చేయబడిన చేపలు, పెరుగు, పనీర్, లస్సీ, తేనె, డ్రై మఖానా, డ్రై సోయాబీన్స్, బఠానీలు, గోధుమలు, ఇతర తృణధాన్యాలు, పఫ్డ్ రైస్‌పై 5 శాతం GST విధించాలని నిర్ణయించింది. అయితే కొన్ని ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులపై ఇది వరకు కొన్ని మినహాయింపులు ఉండేవి. ఆ మినహాయింపులు ఇక నుంచి తొలగించింది కేంద్రం. దీంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది.

కొత్త రేట్లు జూలై 18 నుండి అమల్లోకి..

పన్ను రేట్లలో మార్పు జూలై 18 నుండి వర్తిస్తుంది. ముందుగా ప్యాక్ చేసిన, లేబుల్ చేసిన గోధుమ పిండి, పాపడ్, పనీర్, పెరుగు, మజ్జిగపై 5 శాతం పన్ను ఉంటుంది.

ఇవి కూడా చదవండి

టెట్రా ప్యాక్‌పై..

ఇక టెట్రా ప్యాక్‌పై 18 శాతం జీఎస్టీ విధించబడుతుంది. అలాగే చెక్కుల జారీకి బ్యాంకులు రుసుము వసూలు చేస్తాయి. అట్లాస్‌తో సహా మ్యాప్‌లు, చార్ట్‌లు 12 శాతం రుసుమును వడ్డించనుంది. ఇది కాకుండా ప్యాక్ చేయని, లేబుల్ లేని, అన్‌బ్రాండెడ్ వస్తువులకు GST నుండి మినహాయింపు ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ GST కౌన్సిల్ నియమించిన వివిధ సమూహాలచే రేట్ల హేతుబద్ధీకరణ సిఫార్సులను ఆమోదించిందని, దీని ఫలితంగా పన్ను రేట్లలో మార్పు వచ్చిందని కౌన్సిల్‌ తెలిపింది. అయితే కాసినోలు, ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలపై GOM నివేదికపై తదుపరి చర్చలు జరపాలని కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో పాటు ఈ నివేదికను మళ్లీ మంత్రుల బృందానికి పంపాలని నిర్ణయించారు.

28 శాతం పన్ను విధించే ప్రతిపాదన:

గోవా ఆర్థిక మంత్రి కాసినోలపై వర్తించే GST రేటుపై మరింత చర్చ జరపాలని కోరారు. ఈ సందర్భంలో ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందెం రెండూ కూడా మళ్లీ పరిగణించబడతాయి. ప్యానెల్ మొత్తం మూడు కార్యకలాపాలపై 28 శాతం జీఎస్‌టిని సిఫార్సు చేసింది. వాటిని జూదంతో సమానం చేసింది. జూలై 15 నాటికి కొత్త నివేదిక సిద్ధమవుతుందని, ఆగస్టులో జరిగే తదుపరి సమావేశంలో కౌన్సిల్ దానిని పరిశీలించనుంది.

హోటల్ గదులపై ఎంత పన్ను వసూలు చేస్తారు?

ఇది కాకుండా రోజుకు రూ.1000 కంటే తక్కువ ధర ఉన్న హోటల్ గదులపై 12 శాతం పన్ను విధించనున్నారు. ప్రస్తుతం ఇది మినహాయింపు కేటగిరీ కిందకు వస్తుంది. ఇది కాకుండా రోజుకు రూ. 5,000 కంటే ఎక్కువ ఉన్న (ICU మినహా) ఆసుపత్రి గది అద్దెపై 5 శాతం జీఎస్టీ విధించబడుతుంది. సోలార్ వాటర్ హీటర్ ఇప్పుడు 12 శాతం GST విధిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!