Indian Railway: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 13 రైళ్లను పునరుద్దరించిన దక్షిణ మధ్య రైల్వే.. ఏయే తేదీల్లో అంటే..!

Indian Railway: ఇండియన్‌ రైల్వే శాఖ ప్రతినిత్యం ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది...

Indian Railway: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 13 రైళ్లను పునరుద్దరించిన దక్షిణ మధ్య రైల్వే.. ఏయే తేదీల్లో అంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 04, 2022 | 7:24 PM

Indian Railway: ఇండియన్‌ రైల్వే శాఖ ప్రతినిత్యం ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతుంటుంది. అలాగే కొన్ని సాంకేతిక కారణాల వల్లనో, రైల్వే ట్రాక్‌ మరమ్మతుల కారణంగానే రద్దు చేసిన రైళ్లను తిరిగి పునరుద్దరిస్తుంటుంది. ఇక తాజాగా దక్షిణమధ్య రైల్వే కొన్ని రైళ్లను పునరుద్దరించింది. 13 డెమో రైళ్లను జూలై నెలలో పునరుద్దరించింది.

1. రైలు నెంబర్‌ 07500 విజయవాడ- గూడురు మధ్య నడిచే రైలును జూలై 6వ తేదీన పునరుద్దరించింది. సాయంత్రం 4.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఒంటి గంటకు గూడురుకు చేరుకుంటుంది.

2. జూలై 7న గూడురు-విజయవాడ మధ్య నడిచే రైలు నెంబర్‌ 07458 ఉదయం 6.20 గంటలకు బయలేదేరి మధ్యాహ్నం 3.25 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

3. జూలై 11వ తేదీన నిజామాబాద్‌-నాందేడ్‌ మధ్య నడిచే రైలు నెంబర్‌ 07853 ఉదయం 6.25 గంటలకు బయలుదేరి 10.10 గంటలకు చేరుకుంటుంది.

4. జూలై 11న నాందేడ్‌-నిజామాబాద్‌ మధ్య నడిచే రైలు నెంబర్‌ 07854 సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి రాత్రి 9.25 గంటలకు చేరుకుంటుంది.

5. జూలై15న విజయవాడ-తెనాలి మధ్య నడిచే 07279 రైలు ఉదయం 5.10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 6.10 గంటలకు చేరుకుంటుంది.

6. జూలై 15న తేనాలి-విజయవాడ మధ్య నడిచే రైలు (07575) 18.50 గంటలకు బయలుదేరి 22.15కు విజయవాడకు చేరుకుంటుంది. 7. జూలై15న కర్నూలు సిటీ-నంద్యాల మధ్య నడిచే రైలు (07499) సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి నంద్యాలకు 10.15కు చేరుకుంటుంది.

8.జూలై17న నంద్యాల-కర్నూలు సిటీ మధ్య నడిచే రైలు (07498) ఉదయం 6.05 గంటలకు బయలుదేరి 9.25కు కర్నూలుకు చేరుకుంటుంది.

9. జూలై 15న గుంటూరు-విజయవాడ మధ్య నడిచే రైలు (07976) ఉదయం 6.25కు బయలుదేరి 7.40కి విజయవాడకు చేరుకుంటుంది.

10. జూలై 16న విజయవాడ-గుంటూరు మధ్య నడిచే రైలు (07464) 12.25కు బయలుదేరి 13.55కు గుంటూరుకు చేరుకుంటుంది.

11. జూలై 16న గుంటూరు-విజయవాడ మధ్య నడిచే రైలు07465) మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరి 3.20 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

12. జూలై 16న విజయవాడ- ఒంగోలు మధ్య నడిచే రైలు (07461) ఉదయం 8 గంటలకు బయలేదేరి 12.40 గంటలకు ఒంగోలుకు చేరుకుంటుంది.

13. జూలై 16న ఒంగోలు-విజయవాడ మధ్య నడిచే రైలు (07576) మధ్యాహ్నం 1.35 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.

Train

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి