Bank of Barodas: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు అలర్ట్.. ఆగస్టు నుంచి కొత్త రూల్స్.. ఆ వివరాలు తప్పనిసరి
Bank of Barodas: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆగస్టు 1వ తేదీ నుంచి రూ.5లక్షలు, ఆపై విలువ కలిగిన చెక్కుల..
Bank of Barodas: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆగస్టు 1వ తేదీ నుంచి రూ.5లక్షలు, ఆపై విలువ కలిగిన చెక్కుల క్లియరెన్స్‌కు పాజిటివ్ పే సిస్టమ్ (PPS)ను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) స్పష్టం చేసింది. లేని పక్షంలో చెక్కులను తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు బ్యాంకు ఖాతాదారులు18002584455 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ లేదా www.bankofbaroda.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని బ్యాంకు వెల్లడించింది.
పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏమిటీ?
పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్)ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించింది. ఎక్కువ విలువ కలిగిన చెక్కుల్లోని వివరాలను మరోసారి ధృవీకరించే ప్రక్రియ. ఈ చెక్కులను జారీ చేసిన వారు ఈ వివరాలను సదరు చెక్కులను క్లియర్ చేస్తున్న బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది. SMS, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితర మార్గాల్లో వివరాలను అందింవచ్చు. లేకపోతే నేరుగా బ్రాంచ్‌ను సంప్రదించి వివరాలను అందించవచ్చు.
ఎలాంటి వివరాలు అందించాలి..?
ఎక్కువ చెక్కు విలువ కలిగిన వాటికి వివరాలను అందించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా నంబర్, చెక్కు నంబర్, దానిపై ఉన్న తేదీ, ఎవరి కోసం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు.. చెక్కుపై ఎంత విలువ ఉంది.. లావాదేవీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ తదితర వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. చెక్కులను క్లియర్ చేస్తున్న సమయంలో బ్యాంకు సిబ్బంది అందించిన వివరాలను పరిశీలించి చెక్కును క్లిక్ చేస్తారు. వివరాలేమి అందించకుంటే చెక్కును క్లియర్ చేయరు. వివరాలు సరిగ్గా లేకపోతే చెక్కును తిరస్కరిస్తున్నట్లు బ్యాంకు సిబ్బంది మీకు SMS రూపంలో తెలియజేస్తారు. లేదా ఫోన్ చేసి కూడా తెలియజేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి