సౌదీ అరేబియా, అమెరికా, రష్యా, ఇరాక్, కువైట్, కెనడా దేశాలు పెద్ద మొత్తంలో ముడి చమురు ఉత్పత్తి చేస్తాయి. ఈ దేశాల ఆర్థిక వ్యవస్థ వృద్ధి, అభివృద్ధిలో చమురు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్ ఉండటంతో ఈ దేశాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి.