AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banks FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు.. ఏ బ్యాంక్ ఎంత పెంచిందంటే..!

Banks FD Rates: పెట్టుబడిదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా కాలక్రమేణా ఆరోగ్యకరమైన సంపదను పొందేందుకు అవకాశం ఉంది.

Banks FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు.. ఏ బ్యాంక్ ఎంత పెంచిందంటే..!
Fd
Shiva Prajapati
|

Updated on: Jul 03, 2022 | 7:11 PM

Share

Banks FD Rates: పెట్టుబడిదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా కాలక్రమేణా ఆరోగ్యకరమైన సంపదను పొందేందుకు అవకాశం ఉంది. అందుకే.. కస్టమర్స్ చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్స్ పై ఇంట్రస్ట్ చూపుతారు. పెట్టుబడి లక్ష్యం స్వల్పకాలికమైనా, మధ్యకాలికమైనా, దీర్ఘకాలికమైనా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు మీ పోర్ట్‌ఫోలియోకు అనువైన ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే.. మెచ్యూరిటీ పదవీకాలం 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. సురక్షిత రాబడిని అందుకోవడంతో పాటు, 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా క్లెయిమ్ చేయవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వడ్డీ రేట్లు పెరుగుతున్నందున.. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీఎఫ్‌సీ, కోటాక్ మహీంద్రా, కెనరా బ్యాంక్ సహా అనేక అగ్ర బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లై వడ్డీ రేట్లను పెంచాయి. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏ బ్యాంక్ ఎంత వడ్డీ రేట్లు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పీఎన్‌బి.. 1 నుండి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 10 నుండి 20 bps వరకు వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు 4 జూలై, 2022 నుండి అమల్లోకి వస్తాయి. సీనియర్ సిటిజన్‌లు అన్ని మెచ్యూరిటీ కాలాల్లో సాధారణ రేటు కంటే 0.50% అదనపు వడ్డీ రేటును పొందుతారు.

ఎస్‌బిఐ.. గత నెల 14 జూన్ 2022న దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంకు 211 రోజుల నుంచి 3 సంవత్సరాలలోపు మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కోటక్ మహీంద్రా బ్యాంక్.. ప్రైవేట్ సెక్టార్‌లో మరో కీలక బ్యాంక్ అయిన కోటాక్ మహీంద్రా బ్యాంక్ జూలై 1, 2022న కొన్ని టేనర్‌లపై వడ్డీ రేట్లను 10 bps పెంచింది. 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై, 10 సంవత్సరాల వరకు, బ్యాంక్ గరిష్టంగా 5.90 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజన్లకు 6.40 శాతం.

IDFC ఫస్ట్ బ్యాంక్.. మరో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ IDFC ఫస్ట్ బ్యాంక్.. 1 నుండి ఐదు సంవత్సరాల వరకు రూ. 2 కోట్ల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును జూలై 1, 2022 నుండి పెంచారు. దీని ప్రకారం, మూడు సంవత్సరాలు, ఐదేళ్ల లోపు డిపాజిట్లపై సాధారణ ప్రజలకు గరిష్టంగా 6.50 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7 శాతం వడ్డీ రేటును ఇస్తోంది.

కెనరా బ్యాంక్.. జూన్ 23, 2022న, కెనరా బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ ప్రస్తుతం 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే రూ. 2 కోట్ల కంటే తక్కువ టర్మ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 2.90 శాతం నుంచి 5.75 శాతం వడ్డీ రేట్లను ఇస్తోంది. అలాగే, సీనియర్ సిటిజన్‌లకు 2.90 శాతం నుంచి 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.