Road Accidents: వాహనదారులకు అలర్ట్.. ఇకపై టైర్లు అలా ఉంటేనే పర్మిషన్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..

గణాంకాలను పరిశీలిస్తే, దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 85,616 రోడ్డు ప్రమాదాలు ఓవర్ స్పీడ్ కారణంగా జరుగుతున్నాయి. వీటిలో సుమారు 32,873 మంది మరణిస్తున్నారు.

Road Accidents: వాహనదారులకు అలర్ట్.. ఇకపై టైర్లు అలా ఉంటేనే పర్మిషన్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
Road Transport Ministry Notifies New Standards For Vehicle Tyresmarriage Controversy
Follow us
Venkata Chari

|

Updated on: Jul 03, 2022 | 12:56 PM

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్, భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్పీడ్ సంయుక్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వాహనాల్లో ఉపయోగించే టైర్ల విషయంలో ప్రభుత్వం తాజాగా కొన్ని కొత్త ప్రమాణాలను విడుదల చేసింది. దీనితో పాటు, ప్రస్తుత టైర్లకు కొత్త డిజైన్‌తోపాటు ప్రమాణాన్ని అమలు చేయడానికి కూడా సమయం నిర్ణయించింది. కొత్తగా రూపొందించే టైర్లను కొత్త ప్రమాణాలకు అనుగుణంగా అక్టోబర్ 1 నుంచి ఉత్పత్తి చేయాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న టైర్లకు ఏప్రిల్ 1, 2023 నుంచి కొత్త రూల్స్‌ వర్తిస్తాయని తెలిపింది. దీనికి సంబంధించి ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

దేశంలో ఏటా దాదాపు 85,616 రోడ్డు ప్రమాదాలు అతివేగం కారణంగా జరుగుతుండగా, అందులో దాదాపు 32,873 మంది మరణిస్తున్నారు. ఈ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టైర్లను అతి వేగంతో నడపడం, వేడెక్కడం లేదా బ్రేకింగ్ సిస్టమ్‌ కారణంగా జారిపోవడం వంటి వాటితో జరుగుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మంత్రిత్వ శాఖ టైర్‌లకు రెండు వేర్వేరు ప్రామాణిక టైర్ రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్‌ని నిర్ణయించింది. వీటి అమలుచేసేందుకు కాల పరిమితిని కూడా నిర్ణయించింది.

కొత్త రూల్స్ ఏంటంటే?

ఇవి కూడా చదవండి

రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లోని రూల్ 95ను సవరిస్తూ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని కింద C1 (ప్యాసింజర్ కార్), C2 (లైట్ ట్రక్), C3 (ట్రక్) మోటార్ వెహికల్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 142:2019 ప్రకారం (బస్సు) టైర్లకు రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ ఎమిషన్ తప్పనిసరి చేసింది. ఈ టైర్లు స్టేజ్ 2 పరిమితులను చేరుకోవడానికి వెట్ గ్రిప్, రోలింగ్ రెసిస్టెన్స్, రోలింగ్ సౌండ్‌ను ఉత్పత్తి చేస్తాయి.

ఎలాంటి ప్రయోజనం ఉంటుంది..

టైర్ల రోలింగ్ రెసిస్టెన్స్ వాహనాల ఇంధన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వెట్ గ్రిప్ వాహనం బ్రేకింగ్ సిస్టమ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. తడిగా ఉన్న రహదారికి, టైర్లకు మధ్య ఘర్షణను పెంచడం ద్వారా వాహన భద్రతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. రోలింగ్ సౌండ్ ఎమిషన్ అనేది హై స్పీడ్ పరిస్థితుల్లో రోడ్డు, టైర్ ఉపరితలం మధ్య రాపిడి వల్ల ఉత్పన్నమయ్యే శబ్దాన్ని సూచిస్తుంది. కొత్త ప్రమాణాల అమలుతో, సడన్ బ్రేకింగ్ వాహనంపై డ్రైవర్ నియంత్రణను తగ్గించదు. టైర్ వేడై పగిలిపోయే లేదా తడిగా ఉన్నప్పుడు జారిపోయే అవకాశాలను మాత్రం తగ్గిస్తుంది.

నిపుణుల ఏమంటున్నారంటే?

మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గుర్మీత్ సింగ్ తనేజా అన్నారు. ఇప్పటి వరకు పాత రోడ్లకు అనుగుణంగా టైర్ల ప్రమాణాలు ఉన్నాయి. ఇంతకుముందు వాహనాల వేగం అంతగా ఉండేది కాదు. రోడ్లు కూడా చాలా సాఫీగా ఉండేవి. దీనివల్ల ప్రమాదాలు తక్కువగా ఉండేవి. కాలక్రమేణా రోడ్లు మెరుగై వాహనాల వేగం కూడా పెరగడం వల్ల టైర్లు వేడెక్కడం, పగిలిపోవడం, ఓవర్ స్పీడ్ వల్ల సడన్ బ్రేకింగ్ జరిగితే జారిపోయే అవకాశం ఉంది. కొత్త రూల్స్‌తో టైర్ల నాణ్యత మెరుగుపడుతుంది. దాంతో ప్రమాదాలు కూడా తగ్గుతాయని చెప్పుకొచ్చారు.