Schemes Benefits: ఈ నాలుగు పథకాలలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా.? అదిరిపోయే బెనిఫిట్స్‌..!

Schemes Benefits: కేంద్ర ప్రభుత్వం మంచి రాబడి పొందేందుకు ఎన్నో పథకాలను రూపొందిస్తోంది. వివిధ పథకాలలో మంచి వడ్డీ రేట్లను పొందడమే కాకుండా పన్ను..

Schemes Benefits: ఈ నాలుగు పథకాలలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా.? అదిరిపోయే బెనిఫిట్స్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 04, 2022 | 4:51 PM

Schemes Benefits: కేంద్ర ప్రభుత్వం మంచి రాబడి పొందేందుకు ఎన్నో పథకాలను రూపొందిస్తోంది. వివిధ పథకాలలో మంచి వడ్డీ రేట్లను పొందడమే కాకుండా పన్ను మినహాయింపు సదుపాయం కూడా పొందవచ్చు. ఈ పథకాలు బ్యాంకులు, పోస్టాఫీసులలో కూడా పొందవచ్చు. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (SCSS), పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్‌ (PPF), సుకన్య సమృద్ది యోజన అకౌంట్‌లపై మంచి వడ్డీ రేట్లు ఉన్నాయి. ప్రస్తుత వడ్డీ రేటు విధానంలో బ్యాంకు ఫిక్స్‌డ్‌డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడిని అందుకోవాలని చూస్తున్న వారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఈ పథకాలను ఎంచుకోవచ్చు.

  1. జాతీయ పెన్షన్‌ పథకం (NPS): నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS) అనేది స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. ఇది చందాదారులు తమ భవిష్యత్తును పెన్షన్‌ రూపంలో భద్రపర్చడనికి ఉపయోగపడే స్కీమ్‌. ప్రభుత్వ పరంగా సెక్యూరిటీ కలిగిన స్కీమ్‌. ఇక్కడ పెట్టుబడిదారులకు మెచ్యూరిటీ, మొత్తం పెన్షన్‌ ఉపసంహరణ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వబడుతుంది. ఈ స్కీమ్‌ పెన్షన్‌ ఫండ్‌ రెగ్యురేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PRAN)చే నిర్వహించబడుతుంది. ఇది సెక్షన్లు 80CCD (1), 80CCD (1B) కింద పన్ను ఆదా ప్రయోజనాలను అందిస్తుంది. సైబ్‌ స్క్రైబర్‌లు ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.6వేల వరకు అందుకోవచ్చు. దీనిని ఏకమొత్తంగా లేదా నెలవారీ వాయిదాల రూపంలో కనీసం రూ.500 చెల్లించవచ్చు. ఎన్‌పీఎస్‌ ప్రస్తుత వడ్డీ రేటు 8-10 శాతంగా ఉంది.
  2. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (SCSS): సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ అనేది ఒక చిన్న పొదుపు పథకం. ఇది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల కంటే మెరుగైన రాబడిని పొందాలని ఆశిస్తున్న సీనియర్‌ సిటిజన్‌లలో NPS, PMVVY అనేది పెట్టుబడి ఎంపిక. సీనియర్‌ సిటిజన్స్‌ 55 ఏళ్లలోపు కానీ 60 ఏళ్ల లోపు వారు పెట్టుబడి పెట్టుకోవచ్చు. వృద్ధాప్యంలో డబ్బును పొదుపు చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో సంవత్సరానికి 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకంలో రూ.1000 కూడా డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఖాతాలో 15 లక్షలు వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు. 60 ఏళ్లు పైబడిన వ్యక్తి బ్యాంకులు లేదా పోస్టాఫీసులలో SCSS ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 5 ​​సంవత్సరాలు. అయితే, పదవీ కాలాన్ని మెచ్యూరిటీ తేదీ నుండి మరో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు. మెచ్యూరిటీ అయిన 1 సంవత్సరంలోపు కూడా పొడిగించవచ్చు.
  3. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతా (PPF): పీపీఎఫ్‌ అనేది మంచి ప్రజాదరణ పొందిన పథకాలలో ఒకటి. ఇందులో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షల వార్షిక పద్దతుల్లో పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్లు ఆదాయపు పన్ను చట్టం మినమాయింపుల సెక్షన్‌ 80Cకి అర్హులు. పీపీఎఫ్‌లు 15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి. పెట్టుబడిదారులు ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.1శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు.
  4. సుకన్య సమృద్ధి పథకం: పోస్టాఫీసులో ఈ పథకం తమ కూతురి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం రూపొందించబడింది. పదేళ్లలోపు వారి ఆడపిల్లల తరపున సంరక్షకులు SSA ఖాతాలను తెరవవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెల వరకు ఒక అమ్మాయి పేరుతో భారతదేశంలో ఒక ఖాతాను మాత్రమే తెరవవచ్చు. ఇందులో కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ. 1,50,000 డిపాజిట్‌తో SSA ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచిన తర్వాత గరిష్టంగా 15 సంవత్సరాల వరకు డిపాజిట్లు చేయవచ్చు. సుకన్య సమృద్ధి ఖాతా డిపాజిట్లపై సెక్షన్‌ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఏడాదికి 1.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!