LIC Policy: మీరు ఎల్‌ఐసీ పాలసీ తీసుకునే ముందు ఈ పని చేయకపోతే ఇబ్బందులే.. డబ్బులు చేతికి అందవు..!

LIC Policy: కరోనా మహమ్మారి తర్వాత లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) పాలసీలు తీసుకునే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. జీవితానికి భరోసా ఇచ్చే ..

LIC Policy: మీరు ఎల్‌ఐసీ పాలసీ తీసుకునే ముందు ఈ పని చేయకపోతే ఇబ్బందులే.. డబ్బులు చేతికి అందవు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 04, 2022 | 5:11 PM

LIC Policy: కరోనా మహమ్మారి తర్వాత లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) పాలసీలు తీసుకునే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. జీవితానికి భరోసా ఇచ్చే ఈ ఎల్‌ఐసీని ఎంతో మంది కొనుగోలు చేస్తున్నారు. ఇన్సూరెన్స్‌ పాలసీల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలా మంది పాలసీలను కొనుగోలు చేసే ముందు కొన్ని తప్పులను చేస్తుంటారు. దాని వల్ల తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. LIC పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, మీ కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా నామినీ అయి ఉండాలి. ఒకవేళ మీరు పాలసీ తీసుకునేటప్పుడు నామినేట్ చేయకపోయి, ఏదైనా ప్రమాదం జరిగితే భారీగా డబ్బును కోల్పోవాల్సి ఉంటుంది.

పాలసీలను తీసుకునే ముందు నామినీ పేర్లను నమోదు చేయడం తప్పనిసరి. అలాంటి సమయంలో మీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా సహాయం పొందుతారు. మీరు ఒకటి కంటే ఎక్కువ పాలసీలను కొనుగోలు చేసినట్లయితే రెండు పాలసీలకు వేర్వేరు నామినీలను నమోదు చేయవచ్చు.

పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, మీరు ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తుల వాటాను నిర్ణయించవచ్చు. వారిని నామినేట్ చేయవచ్చు. దీని కోసం పాలసీని కొనుగోలు చేసేటప్పుడు బీమా కంపెనీ నుండి రాతపూర్వక హామీ తీసుకోవచ్చు. అంతే కాదు, పాలసీదారు నామినీని కూడా ఎప్పటికప్పుడు మార్చుకునే వెసులుబాటును LIC కల్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

నామినీ పేరును మార్చవచ్చు..

నామినీ చనిపోతే లేదా ఉద్యోగం పొంది, మరొక సభ్యునికి ఎక్కువ డబ్బు అవసరమైతే నామినీ పేరును మార్చుకునే వెసులుబాటు ఉంది. నామినీ పేరును నమోదు చేసుకోవాలంటే.. బీమా కంపెనీ వెబ్‌సైట్ నుండి నామినీ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ ఫారమ్‌ను ఎల్‌ఐసి కార్యాలయం నుండి తీసుకోవచ్చు. ఫారమ్‌లో నామినీ వివరాలను పూరించి పాలసీ డాక్యుమెంట్ కాపీని, నామినీతో మీకున్న సంబంధాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే, ప్రతి ఒక్కరి వాటాను నిర్ణయించి రాయాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?