Ration Ranking: రేషన్ పంపిణీలో ఏ రాష్ట్రం నెంబర్ వన్‌లో ఉంది.. రాష్ట్రాల జాబితాను విడుదల చేసిన కేంద్రం
Ration Distribution Ranking: దేశంలో రేషన్ పంపిణీ నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. రేషన్ వల్ల నిరుపేదల ఆకలి తీరుతుంది. రేషన్ షాపుల ద్వారా జాతీయ..
Ration Distribution Ranking: దేశంలో రేషన్ పంపిణీ నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. రేషన్ వల్ల నిరుపేదల ఆకలి తీరుతుంది. రేషన్ షాపుల ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA)ని అమలు చేస్తున్న రాష్ట్రాల ర్యాంకింగ్‌లో ఒడిశా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం సమాచారం అందించింది. భారతదేశంలో ఆహారం, పోషకాహార భద్రతపై రాష్ట్ర ఆహార మంత్రుల సదస్సు సందర్భంగా కేంద్ర ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ ‘NFSA-2022 కోసం రాష్ట్రాల ర్యాంకింగ్‌ను విడుదల చేశారు. ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో త్రిపుర మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా హిమాచల్ ప్రదేశ్, సిక్కిం ఉన్నాయి. లాజిస్టిక్స్ విషయంలో పరిమితులు ఉన్నప్పటికీ, ఈ రాష్ట్రాలు సాధారణ కేటగిరీ రాష్ట్రాలతో బాగా పోటీ పడ్డాయని నివేదిక పేర్కొంది.
ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది?
ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకింగ్స్ నివేదిక ప్రకారం.. ఒడిశా 0.836 ర్యాంకింగ్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (0.797), ఆంధ్రప్రదేశ్ (0.794) రాష్ట్రాలున్నాయి. ఈ జాబితాలో గుజరాత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జాబితాలో చేర్చబడిన ఇతర రాష్ట్రాలు దాద్రా మరియు నగర్ హవేలీ, డామన్ డయ్యూ, మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాలున్నాయి.
11వ స్థానంలో కేరళ
ఇది కాకుండా కేరళ ర్యాంకింగ్ 11వ స్థానంలో ఉంది. తెలంగాణ 12వ స్థానంలో, మహారాష్ట్ర 13వ స్థానంలో, పశ్చిమ బెంగాల్ 14వ స్థానంలో, రాజస్థాన్ 15వ స్థానంలో నిలిచాయి. పంజాబ్ 16వ స్థానంలో నిలిచింది. దీనితో పాటు పంజాబ్ తర్వాత హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాలున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి