Edible Oil Price: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. రేపు కీలక సమావేశం

Edible Oil Price: ప్రస్తుతం ధరలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ధరల కారణంగా సామాన్యుడికి భారంగా మారుతోంది. ఒకవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు నిత్యావసర..

Edible Oil Price: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. రేపు కీలక సమావేశం
Edible Oil Price
Follow us

|

Updated on: Jul 05, 2022 | 8:01 PM

Edible Oil Price: ప్రస్తుతం ధరలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ధరల కారణంగా సామాన్యుడికి భారంగా మారుతోంది. ఒకవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు నిత్యావసర సరుకులు, వంటనూనె ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంటనూనె ధరలు పెరిగిపోవడంతో సామాన్యుడి వంటకు ఇబ్బందిగా మారుతోంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల కారణంగా పరుగులు పెట్టిన నూనె ధర రూ.200 వరకు చేరింది. ఇక రానున్న రోజుల్లో ధరల నుంచి ఉపశమనం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎడిబుల్ ఆయిల్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఎడిబుల్ ఆయిల్ ధరను తగ్గించేందుకు బుధవారం ప్రభుత్వం ముఖ్యమైన సమావేశం నిర్వహించనుంది. నివేదికల ప్రకారం.. రిటైల్ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరను తగ్గించడానికి ఈ సమావేశం నిర్వహించబడుతుంది. ఈ సమావేశంలో చమురు ఎగుమతిదారులు, ఉత్పత్తిదారులందరినీ పిలవనున్నారు. MRPలో మార్పు గురించి విక్రేతలకు సూచనలను జారీ చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎడిబుల్‌ ఆయిల్‌ ధర తగ్గింది. ఈ ప్రయోజనం సామాన్య ప్రజలకు చేరాలని ప్రభుత్వం కోరుతోంది. అందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.

ఎడిబుల్ ఆయిల్ ధరలో 10-15 శాతం తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. పండుగ సీజన్ కూడా దగ్గర పడుతోంది. ద్రవ్యోల్బణం కూడా గరిష్ట స్థాయికి చేరుకుంది. అటువంటి పరిస్థితిలో ధర 10-15 శాతం తగ్గితే, అప్పుడు ప్రజలకు చాలా ఉపశమనం ఉంటుంది. గతంలో ఎడిబుల్ ఆయిల్ ధరలో మార్పు వచ్చి దాని ధర లీటరుకు రూ.10-15 తగ్గింది.

రానున్న రోజుల్లో ధర మరింత తగ్గుతుందని అంచనా ఉంది. కొన్ని దేశాలు ఎడిబుల్ ఆయిల్ ఎగుమతిపై నిషేధం విధించాయని, దాని కారణంగా వారి స్టాక్ చాలా ఎక్కువగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. దాని కారణంగా ధరలో పతనం ఉంది. దీంతో పాటు దేశీయ మార్కెట్‌కు ధర తగ్గుదల దగ్గరలోనే ఉంది. అతి త్వరలో సోయాబీన్ తాజా పంట మార్కెట్లోకి వస్తుంది. దీని కారణంగా సోయాబీన్ నూనె ధర తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ధర మరింత పతనం కానుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే లీటరు ధర రూ.15 వరకు తగ్గింది

జూన్ నెలలో ప్రభుత్వం కమోడిటీపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత ఎడిబుల్ ఆయిల్ ధర తగ్గింది. ఎఫ్‌ఎంసిజి కంపెనీ అదానీ విల్‌మార్‌ వంటనూనె ధరను లీటర్‌కు రూ.10 తగ్గించింది. గతంలో మదర్ డెయిరీ తన ఎడిబుల్ ఆయిల్ ధరలను లీటరుకు రూ.15 వరకు తగ్గించింది. మదర్ డెయిరీ ధార ఎడిబుల్ ఆయిల్స్ బ్రాండ్ క్రింద తన ఎడిబుల్ ఆయిల్‌లను విక్రయిస్తుంది. మదర్ డెయిరీ ఒక లీటర్ మస్టర్డ్ ఆయిల్ ధరను రూ.208 నుంచి రూ.193కి తగ్గించింది.

భారతదేశం ఏటా 70 వేల కోట్లు దిగుమతి

భారతదేశం ఇంకా ఎడిబుల్ ఆయిల్స్‌లో స్వయం సమృద్ధి సాధించలేదు. ఇండోనేషియా, మలేషియా, రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా మొదలైన దేశాల నుండి ప్రతి సంవత్సరం సుమారు 70 వేల కోట్ల విలువైన ఎడిబుల్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాము. ఇందులో అత్యధిక భాగం పామాయిల్. తినదగిన నూనెల డిమాండ్, సరఫరాలో దాదాపు 55 నుండి 60 శాతం గ్యాప్ ఉంది. భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్స్ డిమాండ్ దాదాపు 250 లక్షల టన్నులు ఉండగా, ఉత్పత్తి 110 నుంచి 112 లక్షల టన్నులు మాత్రమే. అందువల్ల దిగుమతుల కంటే ఇక్కడ తినదగిన నూనె ధర ఎక్కువగా ప్రభావితమవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి