Home Lone: ఇలా చేస్తే హోమ్ లోన్ చాలా ఈజీగా పొందొచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..

Home Loan: మీరు ఇల్లు నిర్మించాలని భావిస్తున్నారా? గృహ రుణం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారా? రోజుల కొద్ది బ్యాంకుల చుట్టూ ప్రదిక్షణలు..

Home Lone: ఇలా చేస్తే హోమ్ లోన్ చాలా ఈజీగా పొందొచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..
Representative Image
Shiva Prajapati

|

Jul 05, 2022 | 4:40 PM

Home Loan: మీరు ఇల్లు నిర్మించాలని భావిస్తున్నారా? గృహ రుణం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారా? రోజుల కొద్ది బ్యాంకుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారా? అయినప్పటికీ రుణం పొందలేకపోతున్నారా? అయితే, మీకోసమే ఈ వార్త. సాధారణంగానే హోమ్ ప్రకటనలకే సులువు. కానీ, ఆ లోన్ పొందాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే.. దాని ప్రాసెస్ అంతలా ఉంటుంది మరి. అయితే, ఇప్పుడు మనం హోమ్ లోన్ ఈజీగా ఎలా పొందాలో తెలుసుకుందాం. బ్యాంకుల చుట్టూ తిరిగే ప్రయాస లేకుండా, సులువుగా గృహ రుణాలు ఎలా పొందాలో చూద్దాం.

మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండండి.. త్వరిత గృహ రుణ ఆమోదం పొందడానికి మీ క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించండి. క్రెడిట్ స్కోర్ మీరు రుణాన్ని, క్రెడిట్ డబ్బును తిరిగి చెల్లించడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో తెలియజేస్తుంది. క్రెడిట్ స్కోర్ మీ లోన్స్, మీరు లోన్ ఈఎంఐ చెల్లిస్తున్న తీరు సహా అన్ని వివరాలను అందిస్తుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే వెంటనే గృహ రుణం లభిస్తుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవచ్చు. సకాలంలో చెల్లింపు చేయడం ద్వారా క్రెడిట్ స్కోర్‌ను ఈజీగా పెంచుకోవచ్చు. ఇందులో క్రెడిట్ కార్డ్ చెల్లింపు నుండి విద్యుత్, నీరు, టెలిఫోన్ మొదలైన యుటిలిటీ బిల్లుల వరకు చెల్లించవచ్చు. అదే సమయంలో క్రెడిట్ వినియోగ నిష్పత్తిని తక్కువగా ఉంచే ప్రయత్నం చేయండి. అంటే క్రెడిట్ కార్డ్‌పై పరిమితిలో కొంత భాగాన్ని మాత్రమే ఖర్చు చేయాలన్నమాట. మీరు ఏదైనా రుణం తీసుకున్నట్లయితే దానిని వెంటనే తిరిగి చెల్లించడానికి ప్రయత్నించాలి. అప్పుడప్పుడు క్రెడిట్ రిపోర్ట్‌ని చెక్ చేస్తూ ఉండండి.

త్వరగా రుణం పొందగలిగే చోట దరఖాస్తు చేసుకోవాలి.. ఎక్కడ త్వరగా లోన్ లభిస్తుందో.. ఎక్కడ తక్కువ పేపర్ వర్క్ ఉంటుందో అక్కడి నుంచే లోన్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. చాలా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఈ విషయంలో పోటీని కలిగి ఉన్నాయి. చాలా స్పీడ్‌గా రుణాలను అందజేస్తాయి. చాలా వరకు బ్యాంకులు క్రెడిట్ స్కోర్, ఆదాయం మొదలైనవాటిని త్వరగా తనిఖీ చేసే వ్యవస్థను కలిగి ఉంటాయి. అటువంటి పైనాన్స్ కంపెనీలు, బ్యాంకుల నుండి తక్షణ రుణాన్ని పొందే అవకాశం ఉ:ది. ప్రీ-అప్రూవ్డ్ లోన్ పొందడం కూడా ఒక మార్గంగా చెప్పవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే.. ప్రీ-అప్రూవ్డ్ లోన్ పొందుతారు. దీనికి ఎలాంటి పత్రాలు అవసరం లేదు. రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేటును ఒకసారి తనిఖీ చేయడం తప్పనిసరి. తక్కువ వడ్డీ రేటు లభించే చోట హోమ్ లోన్ తీసుకోవాలి.

ఎక్కువ డౌన్ పేమెంట్ చేయండి.. డౌన్ పేమెంట్‌లో ఎక్కువ డబ్బు ఇస్తే, లోన్ త్వరగా అప్రూవ్ అవుతుంది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్ ఎంత డౌన్ పేమెంట్ చేయవచ్చో చూస్తాయి. బ్యాంకులు రుణం మొత్తంలో 20% డౌన్‌ పేమెంట్‌గా తీసుకొనే ఛాన్స్ ఉంది. మీరు ఇంతకంటే ఎక్కువ చేస్తే ఇంకా మంచిది. దీని వలన తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందుతారు. రుణంలో 20% డౌన్ పేమెంట్ కోసం ఉపయోగిస్తే, భార్యను సహ దరఖాస్తుదారుని చేయడం ద్వారా డబ్బు భారాన్ని తగ్గించవచ్చు.

అన్ని డాక్యూమెంట్స్‌ని రెడీ చేసుకోవాలి.. త్వరగా రుణం పొందేందుకు డాక్యూమెంట్లన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలి. లోన్ కోసం అప్లై చేసే ముందు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను రెడీగా ఉంచుకోవాలి. బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లినప్పుడు.. మీ వద్ద ఎలాంటి పేపర్స్ లేకపోతే నెగిటేవ్ ప్రభావం చూపుతుంది. దీంతో రుణం పొందడంలో అనవసర జాప్యం జరుగుతుంది. అందుకే, ముందుగా మీ క్రెడిట్ స్కోర్‌ మంచిగా ఉంచుకోవాలి, పేపర్స్ రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే బ్యాంకు అధికారులు లోన్ కోసం కాల్ చేసినప్పుడు, క్రెడిట్ స్కోర్ ఎంత అనేది మొదటి ప్రశ్న వస్తుంది. అలాగే, ఆదాయం, అప్పు, అన్ని వివరాలను దగ్గర ఉంచుకోవాలి. హోమ్ లోన్ మంజూరు కావడానికి ఈ విషయాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu