AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toyota SUV Cars: భారతదేశంలో టయోటా నుంచి మూడు కొత్త SUV కార్లు.. వచ్చే నెలలో బుకింగ్‌..!

Toyota SUV Cars: మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. వాహనదారులను మరింతగా ఆకట్టుకునే విధంగా అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ అందుబాటులోకి..

Toyota SUV Cars: భారతదేశంలో టయోటా నుంచి మూడు కొత్త SUV కార్లు.. వచ్చే నెలలో బుకింగ్‌..!
Toyota Suv Cars
Subhash Goud
|

Updated on: Jul 06, 2022 | 3:15 PM

Share

Toyota SUV Cars: మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. వాహనదారులను మరింతగా ఆకట్టుకునే విధంగా అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక టయోటా ఇటీవలే అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను గ్లోబల్ ప్రీమియర్‌గా భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఉత్పత్తి ఆగస్టు నుండి కర్ణాటకలోని బిడాడి ప్లాంట్‌లో ప్రారంభమవుతుంది. టయోటా కొత్త మిడ్-సైజ్ SUVని అభివృద్ధి చేయడానికి మారుతి సుజుకితో జతకట్టింది. కస్టమర్ల కోసం కంపెనీ త్వరలో దీన్ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. మరోవైపు, మారుతి సుజుకి తన కొత్త మిడ్-సైజ్ SUVని కూడా జూలై 20న ప్రదర్శించనుంది. నివేదికల ప్రకారం.. హైరైడర్ కాకుండా, టయోటా దాని ప్రసిద్ధ SUV అర్బన్ క్రూయిజర్, ఫార్చ్యూనర్ కొత్త మోడళ్లపై కూడా వేగంగా పనిచేస్తోంది. కొత్త SUVని తీసుకురావడానికి టయోటా సన్నాహాలు ఏమిటో చూద్దాం.

టయోటా హైరైడర్‌ను వచ్చే నెలలో విడుదల చేయవచ్చు. సంస్థ ఇప్పటికే తన బుకింగ్‌ను ప్రారంభించింది. కస్టమర్లు సంస్థ అధీకృత డీలర్‌షిప్‌లలో రూ. 25,000 చెల్లించి Hiriderని బుక్ చేసుకోవచ్చు. భారత మార్కెట్లో, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, MG ఆస్టర్, VW టిగాన్, స్కోడా కుషాక్‌లతో పోటీపడుతుంది. ఈ SUV రెండు హైబ్రిడ్ ఎంపికలతో వస్తుంది.

అర్బన్ క్రూయిజర్ కొత్త మోడల్

ఇవి కూడా చదవండి

టయోటా అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో అర్బన్ క్రూయిజర్ ఒకటి. దీంతో పాటు గ్లాంజా అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. SUV మంచి అమ్మకాలను చూస్తే, కంపెనీ అర్బన్ క్రూయిజర్ కొత్త మోడల్‌ను పరిచయం చేయగలదు. 1.5L K15C పెట్రోల్ ఇంజన్‌తో అర్బన్ క్రూయిజర్ SUV కొత్త మోడల్‌ను రాబోయే నెలల్లో విడుదల చేయవచ్చు. ఈ ఇంజన్ కొత్త బ్రెజ్జా, హైరైడర్‌లలో కూడా ఉంది.

టయోటా నెక్స్ట్ జెన్ ఫార్చ్యూనర్

హైరైడర్, కాంపాక్ట్ అర్బన్ క్రూయిజర్ SUV కాకుండా, కంపెనీ ఫార్చ్యూనర్ కొత్త మోడల్‌ను కూడా పరిచయం చేయనుంది. టయోటా తదుపరి తరం ఫార్చ్యూనర్‌పై పని చేస్తోంది. ఇది బాహ్య, ఇంటీరియర్‌లో అనేక మార్పులను చేసింది. రాబోయే నెలల్లో కొత్త ఫార్చ్యూనర్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని విశ్వసిస్తున్నారు. భారతీయ మార్కెట్లో ఈ SUV డీజిల్ హైబ్రిడ్ వేరియంట్‌తో 2023లో రావచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి