TVS Ronin: టీవీఎస్ నుంచి కొత్త బైక్.. స్టైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లు..
TVS Ronin: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. జూలై 6న ఈ బైక్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త బైక్ లాంచ్ ఈవెంట్‌ను టీవీఎస్ గోవాలో నిర్వహిస్తోంది. టీవీఎస్ రోనిన్ పేరుతో ఈ కొత్త మోడల్ బైక్‌ను...
TVS Ronin: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. జూలై 6న ఈ బైక్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త బైక్ లాంచ్ ఈవెంట్‌ను టీవీఎస్ గోవాలో నిర్వహిస్తోంది. టీవీఎస్ రోనిన్ పేరుతో ఈ కొత్త మోడల్ బైక్‌ను మరికాసేపట్లో లాంచ్ చేయనున్నారు. అయితే కంపెనీ ఈ బైక్‌కు సంబంధించి విడుదలకు ముందు అధికారికంగా ఎలాంటి విషయాలను వెల్లడించలేదు. అయితే ఇంటర్‌నెట్‌లో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోల ఆధారంగా టీవీఎస్ యూత్‌ను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చినట్లు అర్థమవుతోంది. సింగిల్ సీట్ మోడల్‌లో బైక్‌ను రూపొందించారు. ఫ్రంట్‌లైట్‌ను కూడా చాలా స్టైలిష్‌గా ఇచ్చారు. డ్రాప్ ఆకారంలో ఉన్న ఫ్లూయల్ ట్యాంక్‌ను అందించారు. ఇక ఇంజన్ విషయానికొస్తే ఈ బైక్‌లో 125 సీసీ ఇంజన్ వస్తున్నట్లు సమాచారం. అలాగే టీవీఎస్ అపాచేలాగే ఇందులో కూడా 225 సీసీ కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌లో టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ పేరుతో బ్లూటూత్ క్లస్టర్‌ను అందించారు. మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్‌తో పాటు ఏబీఎస్ సిస్టమ్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ధర విషయానికొస్తే ఈ బైక్ ఎక్స్ షోరూమ్ రూ. 1.49 లక్షలకు లభించనున్నట్లు సమాచారం.
టీవీఎస్ రోనిన్ 225 బైక్ 20 బీహెచ్‌పీ పవర్, 18 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ బైక్ 5 గేర్లతో రానుంది. ఈ బైక్‌లో గ్రౌండ్ క్లియరెన్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఎల్‌ఈడీ లైటింగ్ అదనపు ఆకర్షణ. ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మరికాసేపట్లో అధికారికంగా అందుబాటులోకి రానుంది.
మరిన్ని బిజినెస్ కథనాల కోసం క్లిక్ చేయండి..