LIC Policy: ఎల్‌ఐసీలో కోటి రూపాయలు పొందే అద్భుతమైన పాలసీ.. పూర్తి వివరాలు..!

LIC Policy: ప్రస్తుతం బీమా పాలసీలు చేసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. కరోనా తర్వాత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హెల్త్‌ ఆన్సూరెన్స్‌లు భారీగా..

LIC Policy: ఎల్‌ఐసీలో కోటి రూపాయలు పొందే అద్భుతమైన పాలసీ.. పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 06, 2022 | 4:35 PM

LIC Policy: ప్రస్తుతం బీమా పాలసీలు చేసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. కరోనా తర్వాత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హెల్త్‌ ఆన్సూరెన్స్‌లు భారీగా పెరిగాయి. ఇక లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC)లో పాలసీలు భారీగా చేసుకుంటున్నారు. ఎల్‌ఐసీ కూడా కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రకరకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. పాలసీ చేసుకోవడం వల్ల కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ఎల్‌ఐసీలో రకరకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. టర్మ్ పాలసీ, మనీ బ్యాక్, యాన్యుటీ, హెల్త్ ఇలా పలు రకాల ప్లాన్లు ఉండగా, అవసరాలకు తగినట్లుగా ఎంచుకుంటున్నారు. ఎల్‌ఐసీ తీసుకువచ్చిన పాలసీల్లో ‘ఎల్‌ఐసీ జీవన్ శిరోమణి పాలసీ’ కూడా ఒకటుంది. ఈ పాలసీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ ఎల్‌ఐజీ జీవన్ శిరోమణి పాలసీ అనేది నాన్‌ లింక్డ్‌, పార్టిసిపేటింగ్, ఇండివీజువల్, లైఫ్ అస్యూరెన్స్ సేవింగ్స్ ప్లాన్. ఈ పాలసీ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ మనీ బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌? ఈ స్కీమ్‌ ద్వారా కనీసం కోటి రూపాయల వరకు అందుకోవచ్చు. ఈ ప్లాన్‌ కింద ప్రతి రూ.1000 బీమా మొత్తానికి రూ.50 గ్యారంటీ అడిషన్స్‌ లభిస్తుంది. ఇది మొదటి ఐదేళ్లకు వర్తిస్తుంది. ఐదు సంవత్సరాలు దాటినట్లయితే రూ.55 పొందవచ్చు. పాలసీ వ్యవధిలో పాలసీదారుడు దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో ఈ ప్లాన్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. పాలసీ కింద, పాలసీ వ్యవధిలో నిర్దేశిత వ్యవధిలో పాలసీదారు మనుగడపై కాలానుగుణ చెల్లింపులు కూడా చేయబడతాయి.

ప్రీమియం మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున చెల్లించుకునే వెసులుబాటు ఉంది. ఇందులో మీకు నచ్చిన విధంగా ఎంపిక చేసుకోవచ్చు. అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే నేరుగా వేతనం నుంచి కూడా కట్‌ చేసుకునే సదుపాయం కూడా పెట్టుకోవచ్చు. లేదంటే బ్యాంకు అకౌంట్‌ నుంచి కూడా ప్రీమియం కట్‌ అయ్యే విధంగా చేసుకోవచ్చు. 18 నుంచి 67 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 14, 16, 18, 20 సంవత్సరాలుగా ఉంది. మీకు నచ్చిన టర్మ్‌ పాలసీని ఎంచుకోవచ్చు. కనీస ప్రీమియం చెల్లింపు టర్మ్ 4 సంవత్సరాలు. కనీసం రూ. కోటి బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.

ఇవి కూడా చదవండి

పాలసీని ఎంచుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్టంగా 55 సంవత్సరాలు. డెత్ బెనిఫిట్ కింద పాలసీ ప్రాథమిక హామీ మొత్తంలో 125% కంటే ఎక్కువ లేదా వార్షిక ప్రీమియం 7 రెట్లు ఎక్కువ మొత్తాన్ని అందిస్తుంది. అయితే ప్రయోజనం ఐదు పాలసీ సంవత్సరాలు పూర్తయిన తర్వాత కానీ మెచ్యూరిటీ తేదీకి ముందు ఇవ్వబడుతుంది. పాలసీ తీసుకున్న వ్యక్తి ఐదేళ్లలోపు ఏదైనా కారణం చేత మరణించినట్లయితే బీమా మొత్తంతో పాటు గ్యాంటీ అడిషన్స్‌ చెల్లిస్తారు. అదే ఐదేళ్ల తర్వాత, మెచ్యూరిటీ కన్నా ముందు మరణిస్తే.. అప్పుడు బీమా మొత్తం గ్యారంటీ అడిషన్స్, లాయల్టీ బోనస్ వంటివి లభిస్తాయి. ఒక వేళ పాలసీదారుడు జీవించి ఉంటే.. నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తూ వస్తారు.

మిగతా మొత్తం మెచ్యూరిటీ సమయంలో వస్తుంది. 16 ఏళ్ల పాలసీ అయితే 35 శాతం బీమా మొత్తాన్ని 12,14 సంవత్సరాల్లో లభిస్తుంది. 18 ఏళ్ల పాలసీ అయితే 40 శాతం మొత్తాన్ని 14వ ఏటా, 16వ ఏటా పొందొచ్చు. ఇక 20 ఏళ్ల పాలసీ తీసుకుంటే 45 శాతం మొత్తాన్ని 16,18 సంవత్సరాల్లో పొందే అవకాశం ఉంటుంది. 14 సంవత్సరాల పాలసీ కాలవ్యవధికి, LIC 10వ, 12వ పాలసీ వార్షికోత్సవం సందర్భంగా ప్రాథమిక హామీ మొత్తంలో 30% చెల్లిస్తుంది. 16 సంవత్సరాల టర్మ్ విషయంలో, ప్రతి 12వ మరియు 14వ పాలసీ వార్షికోత్సవంలో ప్రాథమిక హామీ మొత్తంలో 35% చెల్లించబడుతుంది. ఇంకా 14వ,16వ పాలసీ వార్షికోత్సవంలో 40% ప్రాథమిక హామీ మొత్తం 18 సంవత్సరాల పదవీకాలంపై చెల్లించబడుతుంది. 20 సంవత్సరాల పదవీ కాలానికి సంబంధించి, 16వ, 18వ పాలసీ వార్షికోత్సవంలో 45% ప్రాథమిక హామీ మొత్తం చెల్లించబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!