జగన్ ఓ యోధుడు – పూరి జగన్నాధ్

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సోదరుడు ఉమా శంకర్ గణేష్ ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరపున నర్సీపట్నం నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక ఈ సందర్భంగా పూరి జగన్నాధ్ ట్విట్టర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసలు కురిపించారు. ఏపీ ఎన్నికల్లో గెలిచిన జగన్ మొత్తానికి రాజన్న కొడుకని అనిపించుకున్నాడని అన్నారు. ఇక గెలిచిన తర్వాత ఆయన ముఖంలో విజయ గర్వం లేదని, కేవలం అందరూ పొడిచిన కత్తిపోట్లు, ఒంటరిగా కూర్చుని […]

జగన్ ఓ యోధుడు - పూరి జగన్నాధ్
Follow us
Ravi Kiran

|

Updated on: May 26, 2019 | 5:09 PM

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సోదరుడు ఉమా శంకర్ గణేష్ ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరపున నర్సీపట్నం నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక ఈ సందర్భంగా పూరి జగన్నాధ్ ట్విట్టర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసలు కురిపించారు. ఏపీ ఎన్నికల్లో గెలిచిన జగన్ మొత్తానికి రాజన్న కొడుకని అనిపించుకున్నాడని అన్నారు. ఇక గెలిచిన తర్వాత ఆయన ముఖంలో విజయ గర్వం లేదని, కేవలం అందరూ పొడిచిన కత్తిపోట్లు, ఒంటరిగా కూర్చుని ఏడ్చిన కనీళ్ళు కనిపించాయి అని చెప్పారు. అలాగే గత ఎన్నికల్లో ఓడిపోయిన తన తమ్ముడి మీద నమ్మకం ఉంచి మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిపించిన జగన్‌కు తన కుటుంబం రుణపడి ఉంటుందని అన్నారు.