Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్‌ విద్యార్థిని వెంటపడ్డ పోకిరీ.. మాట వినలేదని బ్లేడ్‌తో దాడి.. పరిస్థితి విషమం..

ప్రేమ పేరుతో ఓ యువకుడు ఇంటర్మీడియట్ విద్యార్థినిపై బ్లేడుతో దాడి చేశాడు. గాయపడిన విద్యార్థిని సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందన్నారు వైద్యులు.

ఇంటర్‌ విద్యార్థిని వెంటపడ్డ పోకిరీ.. మాట వినలేదని బ్లేడ్‌తో దాడి.. పరిస్థితి విషమం..
Attack On Girl
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 12, 2022 | 1:27 PM

మిషన్‌ క్రాస్‌రోడ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు ఇంటర్మీడియట్ విద్యార్థినిపై బ్లేడుతో దాడి చేశాడు. గాయపడిన విద్యార్థిని సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందన్నారు వైద్యులు. సర్జరీ చేసిన డాక్టర్లు 31 కుట్లు వేశారు. బాధితురాలి కుటుంబసభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దాడి చేసిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జరిగిన ఘటనలో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అట్టుడికిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

త్తర్ప్రదేశ్ లోని ఝూన్సీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని..స్థానిక గ్వాలియర్ రోడ్ ప్రాంతంలో నివసిస్తోంది. కొన్ని రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం కోచింగ్ సెంటర్‌కు వెళ్తోంది. అయితే బాలికను దానిష్ ఖాన్ అనే యువకుడు రెండేండ్లుగా వేధిస్తున్నట్టు తెలిసింది. సోమవారం సాయంత్రం బాలిక కోచింగ్ సెంటర్‌కు వెళ్తుండగా అతను ఆమెను అడ్డగించాడు. తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో బాలిక మెడపై దాడి చేశాడు. అక్కడే ఉన్న బాలిక స్నేహితురాలు విద్యార్థినీని కాపాడింది. బాధితురాలు తీవ్ర రక్తస్రావంతోనే కోచింగ్ సెంటర్‌కు చేరుకున్న బాలికను టీచర్‌, తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.. బాధితురాలికి తండ్రి లేడు. తల్లి, ఇద్దరు అక్కలు, అన్నయ్యతో కలిసి ఉంటోంది.

ఇవి కూడా చదవండి

నిందితుడు దానిష్ రెండేండ్లుగా తన కూతురిని వేధిస్తున్నాడని బాలిక తల్లి ఆరోపించింది. కోచింగ్ సెంటర్ నుంచి తన కుమార్తె ఫోన్ నంబర్ సంపాదించాడని.. వివిధ ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ చేసి వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు కోచింగ్‌కు వెళ్లే సమయంలో ప్రతిరోజూ వెంటపడుతూ వేధిస్తున్నాడని తెలిపింది. భయంతో తన కూతరు ఏ రోజు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదని ఆ తల్లి రోధిస్తూ చెప్పింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. అయితే బాలికతో యువకుడికి స్నేహం ఉందని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చేదు కాకరకాయతో చెప్పలేని లాభాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
చేదు కాకరకాయతో చెప్పలేని లాభాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..
పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..
ఎన్నో ఏళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ బైక్‌లు ఇకపై భారతదేశంలో ఉండవు!
ఎన్నో ఏళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ బైక్‌లు ఇకపై భారతదేశంలో ఉండవు!
కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్..
కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్..
అయ్యో భగవంతుడా.. పసివాడి ఉసురు తీసిన ఊర కుక్క..
అయ్యో భగవంతుడా.. పసివాడి ఉసురు తీసిన ఊర కుక్క..
ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు సమస్యలకు చెక్ పడినట్టే!
ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు సమస్యలకు చెక్ పడినట్టే!
ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్..
ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..
ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!
ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!
అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?
అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?