Spicejet: స్పైస్‌ జెట్‌కు ఏమైంది.? దుబాయ్‌-మధురై ఫ్లైట్‌కు తప్పిన ప్రమాదం.. 24 రోజుల్లో ఇది 9వ ఘటన..

Spicejet: ప్రైవేట్‌ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. వరుస సాంకేతిక సమస్యల కారణంగా ఈ సంస్థ అభాసుపాలవుతోంది. 18 రోజుల్లో 8 సార్లు సాంకేతిక సమస్యలు రావడంతో డీజీసీఏ సీరియస్ అయితన విషయం తెలిసిందే. స్పైస్ జెట్ యాజమాన్యానికి నోటీసులు...

Spicejet: స్పైస్‌ జెట్‌కు ఏమైంది.? దుబాయ్‌-మధురై ఫ్లైట్‌కు తప్పిన ప్రమాదం.. 24 రోజుల్లో ఇది 9వ ఘటన..
SpiceJet
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 12, 2022 | 3:40 PM

Spicejet: ప్రైవేట్‌ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. వరుస సాంకేతిక సమస్యల కారణంగా ఈ సంస్థ అభాసుపాలవుతోంది. 18 రోజుల్లో 8 సార్లు సాంకేతిక సమస్యలు రావడంతో డీజీసీఏ సీరియస్ అయితన విషయం తెలిసిందే. స్పైస్ జెట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. వరుస ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే తాజాగా మరో సాంకేతిక సమస్య వెలుగులోకి వచ్చింది. తాజాగా దుబాయ్‌-మధురై మధ్య నడిచే విమానానికి పెను ప్రమాదం తప్పింది.

బోయింగ్‌ బి737 మ్యాక్స్‌ విమానం ఫ్రంట్‌ వీల్‌ సరిగ్గా పనిచేయకపోవడంతో సోమవారం ఈ విమానం ఆలస్యంగా బయలు దేరింది. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారులు తెలిపారు. ఈ సంఘటనతో గడిచిన 24 రోజుల్లో స్పైస్‌జెట్‌లో తలెత్తిన 9వ సమస్య ఇది. సోమవారం మధురై నుంచి దుబాయ్‌కి వెళ్లిన బోయింగ్‌ బీ737 విమానం ల్యాండ్‌ అయిన తర్వాత ఇంజనీర్‌ వాక్‌-అరౌండ్‌ తనిఖీలో భాగంగా ఫ్రంట్‌ వీల్‌లో లోపాన్ని గుర్తించాడు. దీంతో ముంబై నుంచి మరో విమానాన్ని దుబాయ్‌కి తెప్పించారు. ఈ విషయమై స్పైస్‌జెట్‌ అధికార ప్రతినిథి మాట్లాడుతూ.. సోమవారం దుబాయ్‌ నుంచి మదురై రావాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా చివరి క్షణంలో ఆలస్యమైంది. వెంటనే ప్రత్యామ్మాయ విమానాన్ని ఏర్పాటు చేసిన ప్రయాణికులను పంపించాం అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే స్పైట్‌ జెట్‌లో లోపాల పర్వం జూలై 2న మొదలైంది. ఢిల్లీ-జబల్‌పూర్ స్పైస్ జెట్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే పొగలు వచ్చాయి. ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత జూలై 5న బోయింగ్ 737 ఫైటర్‌ టేకాఫ్‌ అయిన తర్వాత వెదర్‌ రాడార్‌ పనిచేయక తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అనంతరం పలు సాంకేతిక లోపాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలా కేవలం 18 రోజల్లోనే 8 సార్లు ఏదో ఒక సంఘటన జరగడంతో డీజీసీఏ స్పైస్‌ జెట్‌పై సీరియస్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?