Tiger Raja: రాజా ఇక లేడు..! దేశంలో దీర్ఘాయుష్షుతో బతికిన పెద్దపులి కన్నుమూత

2008, ఆగష్టులో నార్త్‌ బెంగాల్‌ సుందర్‌బన్‌ అడవుల్లో ఓరోజు మొసలితో పోరాడి తీవ్రంగా గాయపడ్డ ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ జాతికి చెందిన రాజాను.. సౌత్‌ ఖైర్‌బరి టైగర్‌ రెస్క్యూ సెంటర్‌కు తీసుకొచ్చారు.

Tiger Raja: రాజా ఇక లేడు..! దేశంలో దీర్ఘాయుష్షుతో బతికిన పెద్దపులి కన్నుమూత
Tiger Raja
Follow us
Jyothi Gadda

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 12, 2022 | 2:59 PM

దేశంలో సుదీర్ఘకాలం జీవించిన రికార్డు దక్కించుకున్న పెద్ద పులి రాజా ఇక లేదు. రాజా 25 ఏళ్ల కంటే ఎక్కువే బతికింది. తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య వచ్చిన ఆ పులి.. ఇన్నేళ్లు బతుకుతుందని ఎవరూ అనుకోలేదు. అధికారిక లెక్కల ప్రకారం.. రాజా అనే పెద్దపులి 25 ఏళ్ల కంటే ఎక్కువే బతికింది. ఈ క్రమంలోనే సోమవారం వేకువజామున ఎస్‌కేబీ(సౌత్‌ ఖైర్‌బరి) రెస్క్యూ సెంటర్‌లో రాజా కన్నుమూసినట్లు ఫారెస్ట్‌ అధికారులు ప్రకటించారు.

2008, ఆగష్టులో నార్త్‌ బెంగాల్‌ సుందర్‌బన్‌ అడవుల్లో ఓరోజు మొసలితో పోరాడి తీవ్రంగా గాయపడ్డ ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ జాతికి చెందిన రాజాను.. సౌత్‌ ఖైర్‌బరి టైగర్‌ రెస్క్యూ సెంటర్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో అది బతుకుతుందని ఎవరూ అనుకోలేదు. వైద్య బృందం, నిర్వాహకులు శ్రమించి దానిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు.

ఆ తర్వాత ‘రాజా’ దాదాపు పదిహేనేళ్లు బతికింది. దేశంలో సుదీర్ఘ కాలం జీవించిన పెద్దపులిగా రాజా నిలిచించి. రాజా 25 ఏళ్ల 10 నెలలు బతికి రికార్డుకెక్కింది. రాజాకు ఇటీవలి కాలంలో తీవ్రమైన అనారోగ్య లక్షణాలు కనిపించలేదని, అతని మరణానికి వృద్ధాప్య సంబంధిత సమస్యలు అకస్మాత్తుగా బయటపడవచ్చని భావిస్తున్నట్లు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ దేబల్ రాయ్ పిటిఐకి తెలిపారు.

ఇవి కూడా చదవండి

రాజా దేశంలోనే అత్యంత పురాతనమైన రాయల్ బెంగాల్ టైగర్ అని అధికారికంగా నిర్ధారించలేకపోయినప్పటికీ.. ఇవి సాధారణంగా 20 ఏళ్లకు మించి జీవించవు. అనేక ప్రామాణిక ప్రోటోకాల్‌ల ఆధారంగా 2008లో రాజా వయస్సు 12 ఉండేదని మరో అటవీ అధికారి తెలిపారు. రాజా తన కీపర్లు, పశువైద్యుల పిలుపుకు ప్రతిస్పందించేవాడని చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి