NABARD Recruitment 2022: నాబార్డులో 170 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD).. ఒప్పంద ప్రాతిపదికన ఆఫీసర్స్-గ్రేడ్ 'ఏ' పోస్టుల (Officers Grade A Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
NABARD Officers Grade A Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD).. ఒప్పంద ప్రాతిపదికన ఆఫీసర్స్-గ్రేడ్ ‘ఏ’ పోస్టుల (Officers Grade A Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 170
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ – గ్రేడ్ ఏ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి
ఖాళీల వివరాలు:
- రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ పోస్టులు: 161
- రాజ్‌భాష సర్వీస్ పోస్టులు: 7
- ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ పోస్టులు: 2
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆర్మీ/నేవీ/వైమానిక దళంలో కనీసం ఐదు సంవత్సరాల కమీషన్డ్ సర్వీస్‌లో పనిచేసిన అధికారి అయ్యి ఉండాలి. అలాగే ఎక్స్‌సర్వీస్‌మెన్ గుర్తింపు కార్డు కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము:
- గ్రేడ్ ఏ పోస్టులకు: రూ.800
- రాజ్‌భాష/ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ పోస్టులకు: రూ.750
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 18, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 7, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.