Fact Check: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 6 వేల భృతి ఇస్తోందా? ఇందులో నిజమెంత?

Fact Check: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను ఉపయోగించని వారుండరంటే అతిశయోక్తి కాదు. పిల్లలు మొదలు పెద్దలకు వరకు..

Fact Check: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 6 వేల భృతి ఇస్తోందా? ఇందులో నిజమెంత?
Money
Follow us

|

Updated on: Jul 17, 2022 | 7:27 AM

Fact Check: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను ఉపయోగించని వారుండరంటే అతిశయోక్తి కాదు. పిల్లలు మొదలు పెద్దలకు వరకు అందరూ ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాను యూజ్ చేస్తూనే ఉంటారు. ఆ సోషల్ మీడియా సాధనాల వల్లే యావత్ ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన ఏం జరిగినా ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు, సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొందరు దోచుకోవడానికి వాడుకుంటుంటే.. మరికొందరు అసత్య ప్రచారాలకు వినియోగిస్తున్నారు. తాజాగా వాట్సాప్‌లో ఓ సందేశం విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఇది చాలా మందిని ప్రభావితం చేస్తోంది. నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల రూ. 6,000 నిరుద్యోగ భృతిని అందజేస్తోందని, ప్రతి నెల నిరుద్యోగుల అకౌంట్లలో ఈ డబ్బు జమ అవుతుందని ఆ సందేశంలో పేర్కొన్నారు.

వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ఈ సందేశం గురించి PIB స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఇది నిజమా? అబద్ధమా? తేల్చింది. ఇందులో వాస్తవం ఏంత అనేదానిని నిర్ధారిస్తూ ట్వీట్ చేసింది. ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి పథకం కింద నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ప్రతి నెల రూ. 6,000 భృతి ఇస్తోందంటూ వాట్సాప్‌లో వైరల్ అవుతున్న కంటెంట్‌లో ఏమాత్రం నిజం లేదని తేల్చింది.

ఇవి కూడా చదవండి

ఆ వైరల్ మెసేజ్ నిజం కాదు.. భారత ప్రభుత్వం అలాంటి పథకాన్ని అమలు చేయడం లేదని పిఐబి స్పష్టం చేసింది. తప్పుడు సందేశాలను ఫార్వార్డ్ చేయొద్దని ప్రజలకు సూచింది. ఫేక్ మెసేజ్‌ల పట్ల జాగ్రత్త వహించాలని హితవు చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి సందేశాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పిఐబి తెలిపింది. ఇలాంటి అసత్య సమాచారాన్ని ఫార్వార్డ్ చేయవద్దని పీఐబీ ప్రజలను కోరింది. ఇలాంటి సందేశాల ద్వారా కేటుగాళ్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని, డబ్బును దోచుకునే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది.

ఫ్యాక్ట్ చెక్ ఎలా చేయాలంటే.. ఏవైనా సందేహాస్పద మెసేజ్‌లు మీకు కూడా వస్తే.. దాని వెనుకున్న నిజానిజాలను చెక్ చేయొచ్చు. పీఐబీ ద్వారా ఫ్యాక్ట్ చెక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు అధికారిక లింక్ https://factcheck.pib.gov.in/ని సందర్శించాలి. ఇది కాకుండా, వాట్సాప్ నంబర్ +918799711259 లేదా ఇమెయిల్: pibfactcheck@gmail.comకు కూడా పంపవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో