IndiGo Flight: హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్..

సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఇండిగో ఎయిర్​లైన్స్ ​ఓ ప్రకనటలో వెల్లడించింది.

IndiGo Flight: హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్..
Indigo Flight
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 17, 2022 | 10:09 AM

Indigo Flight Diverted to Pakistan: ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్ రావలసిని ఓ ఇండిగో విమానం.. పాకిస్తాన్‌లోని కరాచీలో ల్యాండ్ అయింది. షార్జా నుంచి హైదరాబాద్​వస్తున్న ఇండిగో ఎయిర్​లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం ఉదయం పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్​పోర్ట్‌లో ల్యాండయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఇండిగో ఎయిర్​లైన్స్ ​ఓ ప్రకనటలో వెల్లడించింది. ప్రయాణికుల్ని హైదరాబాద్​రప్పించేందుకు మరో విమానాన్ని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. భారత ఎయిర్​లైన్స్‌కు చెందిన విమానం ఆకస్మికంగా కరాచీలో ల్యాండ్​ అవడం.. రెండు వారాల వ్యవధిలో రెండో ఘటన కావడం గమనార్హం.

ఇటీవల ఢిల్లీ నుంచి దుబాయ్​వెళ్తున్న స్పైస్​జెట్‌ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జులై 5న పాక్‌లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పుడు ఫ్యూయల్​ఇండికేటర్​సరిగా పనిచేయకపోవడంతో కరాచీకి మళ్లించాల్సివచ్చింది. ఆ ఎస్​జీ-11 విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్​జెట్​విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో ఫ్లైట్‌ను భారత్​ నుంచి పంపారు. కాగా .. ఇప్పటికే ఈఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వడోదర వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇంజిన్‌లో కంపనాలు రావడంతో ముందుజాగ్రత్త చర్యగా గురువారం రాత్రి జైపూర్‌కు మళ్లించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..