Ganesh Temple: కృష్ణా తీరంలో వర సిద్ది వినాయక ఆలయం.. అప్పం సమర్పిస్తే.. వైవాహిక జీవితంలో కష్టాలు తొలగుతాయని నమ్మకం

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చామర్రులో వర సిద్ది వినాయక ఆలయం ఉంది. కృష్ణా నది తీరంలో వినాయకుడు స్వయంభువుగా వెలసినట్లు భక్తులు నమ్ముతారు.

Ganesh Temple: కృష్ణా తీరంలో వర సిద్ది వినాయక ఆలయం.. అప్పం సమర్పిస్తే.. వైవాహిక జీవితంలో కష్టాలు తొలగుతాయని నమ్మకం
Sri Varasiddhi Vinayaka Tem
Follow us

|

Updated on: Aug 03, 2022 | 9:23 PM

Ganesh Temple: అప్పం అర్పిస్తే అన్ని విఘ్నాలను తొలగిస్తాడు.. వివాహ సమయంలో తమ వైవాహిక జీవితంలో కష్టాలు లేకుండా చూడమని ఆ బొజ్జ గణపయ్యకు అప్పం సమర్పిస్తారు. స్వయంభువుగా వెలసిన వరసిద్ది వినాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కృష్ణా తీర ప్రాంత వాసులకు కొంగు బంగారమై వర సిద్ది వినాయకుడు వెలుగొందుతున్నాడు.

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చామర్రులో వర సిద్ది వినాయక ఆలయం ఉంది. కృష్ణా నది తీరంలో వినాయకుడు స్వయంభువుగా వెలసినట్లు భక్తులు నమ్ముతారు. కృష్ణా తీరంలో జపం ఆచరించుకుంటున్న ముని స్వామి వారి మొదట కనిపంచారని అప్పటి నుండి స్వామి వారిని భక్తులు కొలుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాకతీయుల కాలం నాటి విజయ స్థంభంపై స్వామి వారి ప్రస్తావన ఉందని అర్చకులు తెలిపారు. 2014లో ఆలయ జీర్ణోద్దరణ జరగింది. అప్పటి నుండి భక్తుల రాక మరింత పెరిగింది. అచ్చంపేటతో పాటు కృష్ణా ఉత్తర తీరం నుండి నుండి భక్తులు నది దాటి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా వివాహ సమయంలో పెళ్ళి కూతురు లేదా పెళ్ళి కొడుకు స్వామి వారికి అప్పం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా అప్పాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తామని అయితే ఇక్కడ మాత్రం వినాయక స్వామికి అప్పం సమర్పించడం జరుగుతుందని చెప్పారు. ఉండ్రాళ్లకు బదులుగా ఇక్కడ వినాయకుడికి అప్పాలు సమర్పిస్తారన్నారు.

మూడు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ముగింపు రోజు మూషిక ప్రసాదం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. మూడు రోజుల పాటు ఎదురు కోళ్లు, గ్రామోత్సవం ఘనంగా జరుగుతాయన్నారు. సంకట హర హోమంఇక్కడ ప్రత్యేక సంతరించుకుంది. ఇప్పటి వరకూ 101 సంకట నర చతుర్ది హోమాలు జరిగినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. ఆలయ జీర్ణోద్దరణ సయమంలోనే ముగ్గురు అన్నదమ్ములు విగ్రహాలతో ఉపాలయాలను ఏర్పాటు చేశారు. వినాయక ఆయలంలోనే అయ్యప్ప స్వామి ఉపాలయం, సుబ్రమణ్యేశ్వర ఉపాలయాలన్ని కూడా నిర్మించారు. కుజ దోషం ఉన్న భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడకు వచ్చి సుబ్రమణ్యేశ్వర పూజలు చేస్తుంటారు. కుజ దోషం తొలగి భార్యభర్తల మధ్య అన్యోన్యత పెరిగి వారికి సంతానం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.. ముగ్గురు అన్నదమ్ముల ఆలయంలోనే శివ లింగాన్ని, అమ్మవారిని ప్రతిష్టించారు. దీంతో భక్తులు విరివిగా తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారని స్తానికులు తెలిపారు. స్వామి అని పిలిచినంతనే వరాలు కురిపిస్తాడనే నమ్మకంతోనే వర సిద్ది వినాయకుడిగా ఇక్కడ వినాయకుడిని కొలుస్తారన్నారు. గణపతి కల్యాణం రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారన్నారు.

ఇవి కూడా చదవండి

Reporter . T Nagaraju, Tv9 Telugu

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..