Horoscope Today: వీరికి శుభ ఘడియలు.. ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today (04-08-2022): ఏదైనా పని మొదలుపెట్టాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా మంచి ముహూర్తం చూసుకుంటారు చాలామంది. అందుకోసం ఆరోజు రాశిఫలాల (Rasi Phalalu)ను తిరగేస్తారు. వాటిని చూసి మంచి సమయమేదో? అశుభసంకేతాలేమైనా ఉన్నాయేమోనని ఆరాతీస్తాం

Horoscope Today: వీరికి శుభ ఘడియలు.. ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today
Basha Shek

|

Aug 04, 2022 | 6:39 AM

Horoscope Today (04-08-2022): ఏదైనా పని మొదలుపెట్టాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా మంచి ముహూర్తం చూసుకుంటారు చాలామంది. అందుకోసం ఆరోజు రాశిఫలాల (Rasi Phalalu)ను తిరగేస్తారు. వాటిని చూసి మంచి సమయమేదో? అశుభసంకేతాలేమైనా ఉన్నాయేమోనని ఆరాతీస్తాం. మరి ఆగస్టు 4న (గురువారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి.

మేషం

కీలక వ్యవహరాల్లో ముందుడుగు వేస్తారు. విరోధులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు ఇబ్బందులు కలిగిస్తాయి. దత్తాత్రేయుడిని సందర్శించుకుంటే మేలు చేకూరుతుంది.

వృషభం

వీరికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. ముఖ్యమైన పనుల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో తోటివారి సహాయం అందుతుంది. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూ్ర్తిగా వ్యవహరిస్తారు. ఇష్టదైవారాధన శుభం కలుగుతుంది.

మిథునం

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో గొడవలకు దిగకపోవడం ఉత్తమం. అనవసర ఖర్చులు పెరుగుతాయి. దైవారాధన మాత్రం మానవద్దు.

కర్కాటకం

వీరు మానసికంగా దృఢంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం అందుతుంది. శత్రువులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మేలు కలుగుతుంది.

సింహం

కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం లాభిస్తుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారు. శ్రీనివాసుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.

కన్య ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. కీలక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. సానుకూల ఫలితాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చూసుకోవాలి. . దైవారాధన మాత్రం మానవద్దు.

తుల

కీలక పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రమాధిక్యం తప్పదు. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయకండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు చేకూరుతుంది.

వృశ్చికం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురువుతాయి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఇష్ట దైవారాధన మాత్రం మానవద్దు.

ధనస్సు

చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో స్థిరంగా ఆలోచించాలి. విరోధుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శని ధ్యానం చేయడం వల్ల సానుకూల ఫలతాలు పొందుతారు.

మకరం

ఈరాశి వారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. విందులు, వినోద కార్యక్రమాలు, శుభకార్యాక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు పొందుతారు. ఇష్ట దైవారాధన మాత్రం మానవద్దు.

కుంభం

కీలక వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం అందుతుంది. స్థిరమైన నిర్ణయాలతో విజయాలు సాధిస్తారు. గొడవలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం, నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు. శివనామస్మరణతో శుభం కలుగుతుంది.

మీనం

ఆయా రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉన్నత అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. శివపార్వతులను పూజించడం వల్ల సానుకూల ఫలితాలను పొందగలుగుతారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu