Raksha Bandhan: 11 లేదా 12 తేదీల్లో ఎప్పుడు, ఏ ముహూర్తంలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టాలో తెలుసా?

ఈ ఏడాది పౌర్ణమి గడియలు రెండు రోజులు వచ్చాయి. ఈ నెల 11 తేదీన తగులు, 12వ తేదీన మిగులు పున్నమి వచ్చాయి. దీంతో రాఖి పండగ ఆగస్ట్ 11న జరుపుకుంటారా లేక ఆగస్టు 12న జరుపుకుంటారా అనే అయోమయం జనాల్లో నెలకొంది.

Raksha Bandhan: 11 లేదా 12 తేదీల్లో ఎప్పుడు, ఏ ముహూర్తంలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టాలో తెలుసా?
Raksha Bandhan 2022
Follow us

| Edited By: Team Veegam

Updated on: Aug 10, 2022 | 6:27 PM

Raksha Bandhan 2022: హిందూ మతంలో..  శ్రావణ మాసానికి విశిష్టత ఉంది. ఈ నెలలో అనేక పండగలు పర్వదినాలు వస్తాయి. శ్రావణ పౌర్ణమిని రాఖీ పండుగగా జరుపుకుంటారు. పౌర్ణమి రోజున  సోదరీమణులు తమ మణికట్టుకు రాఖీ కట్టి.. తమ సోదరుడు దీర్ఘాయుష్షును కోరుకుంటారు. తనకు రక్ష కట్టిన సోదరిని జీవితాంతం కాపాడతానని.. సోదరుడు వాగ్దానం చేస్తాడు. అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఏడాదంతా రక్షాబంధన్ పండువ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది పౌర్ణమి గడియలు రెండు రోజులు వచ్చాయి. ఈ నెల 11 తేదీన తగులు, 12వ తేదీన మిగులు పున్నమి వచ్చాయి. దీంతో రాఖి పండగ ఆగస్ట్ 11న జరుపుకుంటారా లేక ఆగస్టు 12న జరుపుకుంటారా అనే అయోమయం జనాల్లో నెలకొంది. రక్షా బంధన్ పండుగను ఎప్పుడు, ఏ శుభ సమయంలో జరుపుకుంటారో ఉత్తరాఖండ్ జ్యోతిష్య పరిషత్ అధ్యక్షుడు పండిట్ రమేష్ సెమ్వాల్ తెలిపారు.

ఎప్పుడు, ఏ ముహూర్తంలో సోదరీమణులు రాఖీ కట్టాలంటే:  ఈ సంవత్సరం రాఖీ పండగ ఆగష్టు 11, 2022 న జరుపుకోవాలని పండిట్ రమేష్ సెమ్వాల్ చెప్పారు. 11వ తేదీ గురువారం పౌర్ణమి మధ్యాహ్నం భద్ర దోషం ఉంది.  పంచాంగం ప్రకారం, ఆగష్టు 11, 2022 న, సూర్యోదయం సమయంలో చతుర్దశి తిథి ఉంది. అంతేకాదు గురువారం రోజు పౌర్ణమి తిథి ఉదయం 10:58 నుండి ప్రారంభంకానుంది. దీనితో భద్ర దోషం ఆ రోజు రాత్రి 08:50 వరకు ఉంటుంది. భద్రకాలంలో పర్వదినాలు జరుపుకోవడం శాస్త్రంలో నిషేధం.. కనుక రాత్రి 08:50 గంటల తర్వాత మాత్రమే రాఖీ కట్టడం శుభప్రదం. సోదరీమణులు సాయంత్రం 06:08 నుండి 08:00 గంటల మధ్య సోదరులకు రాఖీ కట్టవచ్చని తెలిపారు.

సోదరుడికి రాఖీ కట్టే పద్ధతి: రాఖీ పండగ రోజున.. సోదరుడికి సోదరి రాఖీ కట్టే ముందు.. స్నానం చేయాలి. కుంకుమ, చందనం, అక్షతం, పెరుగు, స్వీట్లు, స్వచ్ఛమైన నెయ్యి దీపం, దారం లేదా పట్టు లేదా పత్తితో చేసిన రాఖీతో పళ్లెం అలంకరించాలి. అనంతరం సోదరుడిని తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం ఉండేలా కూర్చోబెట్టాలి. తర్వాత సోదరుడికి కుంకుమ పెట్టి.. కుడి చేతి మణికట్టుపై రాఖీని కట్టాలి.  అనంతరం సోదరుడికి స్వీటుని అందించాలి. తన అన్నదమ్ములకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని.. దీర్ఘాయుస్సుతో జీవించాలని సోదరి కోరుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు,  నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)