- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti In telugu: these 5 lessons given by acharya chanakya which will support you in every difficult phase
Chanakya Niti: జీవితంలో ఈ 5 విషయాలను పాటించండి.. కష్ట సమయంలో మద్దతు ఇస్తాయంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రలో పాలన, మనిషి నడవడిక వంటి అనేక విషయాలు చెప్పాడు. చాణక్య చెప్పిన వాటిలో కొన్నింటిని జీవితంలో పాటిస్తే.. మనిషి తన జీవితంలోని చాలా సమస్యలను నివారించుకోవచ్చు. కష్ట సమయాన్ని కూడా అవకాశాలుగా మార్చుకోవచ్చు.
Updated on: Aug 03, 2022 | 6:31 PM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో పక్షులకు ఉండే కొన్ని లక్షణాల గురించి కూడా ప్రస్తావించాడు. ఈ పక్షుల నుంచి మనిషి లక్షణాలను స్వీకరించడం ద్వారా.. ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు. ఒక వ్యక్తి ఏయే పక్షులలో ఏయే లక్షణాలను అలవర్చుకోవచ్చో తెలుసుకుందాం.

ఆచార్య చాణక్యుడు ప్రకారం, యుక్తవయస్సులో.. యువతీయువకులు భవిష్యత్తు గురించి అప్రమత్తంగా ఉండాలి. సరైన వ్యూహాన్ని రూపొందించడం ద్వారా, యువత తమ జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు. అయితే వారు చెడు అలవాట్లకు బానిసగా మారితే అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యువతీయువకులు ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం

కొంగ - కొంగకు తన ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో తెలుసు. అదే విధంగా సంయమనంతో పని చేస్తే విజయం సులువుగా దొరుకుతుంది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కాబట్టి మీ మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఏకాగ్రతతో పని చేయండి.

చెడు చేసే వారు - ఆచార్య చాణక్యుడు ప్రకారం మీ వెనుక చెడు చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇతరులకు మీ ముందు చెడు చేసే వ్యక్తి .. రేపు మీకు ఖచ్చితంగా చెడు చేస్తాడు.

సమయం సందర్భం లేకుండా.. మెలికలు తిరుగుతూ మాట్లాడేవాళ్ళను మనం చూస్తూనే ఉంటాం.. మన చుట్టు పక్కల ఇలా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారి మనసులో ఒకటి అనుకుంటారు.. బయటకు ఒకటి వ్యక్తం చేస్తారు. అలాంటి వారిని నమ్మడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి అలాంటి వారికి వీలైనంత దూరం పాటించండి




