AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: దంపతుల మధ్య గొడవలా.. సంతోషకరమైన జీవితం కోసం ట్రాన్స్‌జెండర్స్ కు ఇలా పరిహారం చేయండి..

జ్యోతిష్యశాస్త్రంలో ట్రాన్స్‌జెండర్స్  కు సంబంధించిన కొన్ని పరిహారాలను సూచించారు. ఈ పరిహారాలను చేస్తే.. మనిషిని అదృష్టం వరిస్తుందని నమ్మకం. 

Astro Tips: దంపతుల మధ్య గొడవలా.. సంతోషకరమైన జీవితం కోసం ట్రాన్స్‌జెండర్స్ కు ఇలా పరిహారం చేయండి..
Astro Tips For Good Luck
Surya Kala
|

Updated on: Aug 03, 2022 | 6:08 PM

Share

Astro Tips For Good Luck: జీవితంలో ఎన్ని సార్లు ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేని సందర్భం వస్తుంది. వృత్తి, వ్యాపారాభివృద్ధి కోసం ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఎటువంటి సందర్భంలోనైనా జీవితంలో సుఖ సంతోషాలు నెలకొనాలంటే.. మీకు అదృష్టాన్ని తెచ్చే కొన్ని చర్యలు తీసుకోండి. జ్యోతిష్యశాస్త్రంలో ట్రాన్స్‌జెండర్స్  కు సంబంధించిన కొన్ని పరిహారాలను సూచించారు. ఈ పరిహారాలను చేస్తే.. మనిషిని అదృష్టం వరిస్తుందని నమ్మకం.

ఆకుపచ్చని వస్త్రాల దానం:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ట్రాన్స్‌జెండర్స్ కు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేస్తే.. బుధుని అనుగ్రహం సొంతం అవుతుంది. దీంతో వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి పెరుగుతుంది. అద్భుత ప్రయోజనాలను పొందుతారు. అయితే ట్రాన్స్‌జెండర్స్కు ఎప్పుడూ  మీరు వాడిన బట్టలు దానం చేయకూడదని గుర్తుంచుకోండి.

డబ్బు దానం: జీవితంలో చాలాసార్లు, ఎంతో కష్టపడి పనిచేసినా ఆర్థికపరమైన అవరోధాలు తప్పడం లేదంటూ కొందరు బాధపడుతుంటారు. మీకు ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే, డబ్బుకు సంబంధించిన సమస్యను అధిగమించడానికి  మీకు వీలైనప్పుడు  ట్రాన్స్‌జెండర్స్ తినడానికి ఆహారం, బట్టలు లేదా కొంత డబ్బును ఇవ్వండి. అనంతరం వారి నుంచి ఒక నాణేన్ని ఆశీర్వాదంగా తీసుకోండి. ఇలా తీసుకున్న నాణెం మీ జీవితంలో అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

సంతోషకరమైన వైవాహిక జీవితానికి పరిహారం: చాలా సార్లు, కొంతమంది సంతోషకరమైన వైవాహిక జీవితంలో అకస్మాత్తుగా  గొడవలు ప్రారంభమవుతాయి.  ఇలా జరగడానికి కారణం.. దాంపత్య జీవితం పై చెడు దృష్టి పడడం అని కొందరి నమ్మకం. జీవితంలో ఏర్పడిన అసమ్మతిని పోగొట్టడానికి.. జీవిత భాగస్వామి ప్రేమను పొందడానికి ట్రాన్స్‌జెండర్స్ కు మేకప్ వస్తువులను దానం చేయండి. ఈ పరిహారాన్ని చేసిన అనంతరం ట్రాన్స్‌జెండర్స్ నుంచి ఆశీర్వాదం తీసుకోండి. దీంతో దంపతుల మధ్య గొడవలు సమసిపోతాయి. సంతోషకరమైన వైవాహిక జీవితం ఏర్పడుతుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు,  నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.