Vidur Niti: డబ్బును సంపాదించడం కంటే ఎలా దాచుకోవాలో తెలుసుకోవాలి.. విదురుడు ఏం చెప్పాడో తెలుసా..
విదుర్ నీతిలో సంపదను సృష్టించడానికి సంబంధించిన కొన్ని పాలసీలు వివరించాడు విదురుడు. వీటిని అనుసరించడం ద్వారా సామాన్యుడు కూడా ధనవంతులుగా మారచ్చు.
మహాభారతంలో చాలా పాత్రలకు చాలా ప్రత్యేకతలున్నాయి. అలాగే విదురుడు పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. విదురుడు గొప్ప జ్ఞాని. తనకు ఉన్న జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాడు. నిజాయితీ పక్షాన నిలబడాలి అనుకునేవాడు విదురుడు. ఇతను ప్రణాళికలకు చాలా పేరుంది. వ్యూహరచనలో, నీతిలో మంచి పేరు సంపాదించాడు విదురుడు. కురుక్షేత్ర యుద్ధం సమయంలో విదురుడి నుంచి సలహాలు కోరాడు ధృతరాష్ట్రుడు. విదురుడు తండ్రి కృష్ణద్వైపాయన వ్యాసుడు. విదురుడికి.. ధృతరాష్ట్రుడికి మధ్య జరిగిన సంభాషణల సమాహారాన్ని విదుర్ నీతి అంటారు. ఈ విదుర్ నీతిలో దౌత్యం, యుద్ధవిధానం నుంచి రాజకీయాలకు సంబంధించిన సూక్ష్మ వివరాల వరకు ప్రస్తావించారు. ఈ విదుర్ నీతిలో సంపదను ఎలా సృష్టించాలో చెప్పాడు. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన విధానాలను వివరించాడు.. అయితే విదురుడు చెప్పిన కొన్నింటి గురించి తెలుసుకుందాం..
డబ్బును సరిగ్గా ఉపయోగించుకోండి : విదుర్ నీతి ప్రకారం, డబ్బు సంపాదించడం కంటే డబ్బును పొదుపు చేయడం ముఖ్యం. అందువల్ల, మీరు డబ్బు ఆదా చేయడం గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా, పెట్టుబడి పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆ తర్వాతే పెట్టుబడి పెట్టండి.
సత్య మార్గంలో నడవండి : సరైన మార్గంలో సంపాదించిన ధనం మీకు విజయాన్ని అందించడమే కాకుండా ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుందని విదుర నీతిలో చెప్పబడింది. అందుకే మనిషి ఎప్పుడూ సత్య మార్గాన్ని అనుసరించాలి. కానీ త్వరగా డబ్బు సంపాదించాలనే తపనతో ప్రజలు తప్పుడు మార్గాన్ని అనుసరిస్తారు. తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు వృధాకు పోతుందంటాడు విదురుడు.
పొదుపు చేయడం నేర్చుకోండి : సంపదలు పోగుపడేందుకు మనస్సును అదుపులో ఉంచుకోవాలని విదుర్ నీతిలో చెప్పాడు. ఎందుకంటే మనిషి మనసు చాలా చంచలమైనది. చేతికి డబ్బులు రాగానే ఖర్చు పెట్టేందుకు రకరకాల ప్లాన్లు వేస్తుంటాడు. ఆ ప్రణాళికలను నెరవేర్చే క్రమంలో డబ్బు వృధా అవుతుందని విదురుడు చెప్పాడు.
చెడు వ్యసనాల చక్రంలో చిక్కుకోవద్దు : విదురుడు విదుర నీతిలో చెప్పినట్లుగా, అన్ని పరిస్థితిలో ఒక వ్యక్తి సహనంతో ఉండాలి. చెడు సమయం వచ్చినా సహనం కోల్పోయి తప్పుడు పనులు చేయకూడదని.. ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు చెడు వ్యసనాల వలలో పడకూడదని అంటాడు విదురుడు. ఈ రెండు పరిస్థితుల్లోనూ ఓపిక పట్టకపోతే జీవితం నాశనమైపోతుందని హెచ్చరిస్తాడు విదురుడు.
మరిన్న ఆధ్యాత్మికం వార్తల కోసం