AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitish Kumar: చేతులు జోడించి చెప్తున్నా.. ఆ పదవిపై ఆశ లేదన్న నితీష్.. ప్రతిపక్షాలను ఏకం చేస్తానన్న బీహార్ సీఎం..

ప్రధాన పదవిపై ఆశ లేదని.. ఆవిషయమే తన మైండ్ లో లేదని బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్ స్పష్టం చేశారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ.. చేతులు జోడించి చెప్తున్నా.. నాకు నిజంగా

Nitish Kumar: చేతులు జోడించి చెప్తున్నా.. ఆ పదవిపై ఆశ లేదన్న నితీష్.. ప్రతిపక్షాలను ఏకం చేస్తానన్న బీహార్ సీఎం..
Nitish Kumar
Amarnadh Daneti
|

Updated on: Aug 12, 2022 | 1:03 PM

Share

Bihar Politics: ప్రధాన పదవిపై ఆశ లేదని.. ఆవిషయమే తన మైండ్ లో లేదని బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్ స్పష్టం చేశారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ.. చేతులు జోడించి చెప్తున్నా.. నాకు నిజంగా ఆ పదవిపై ఆశ లేదు.. ప్రజల కోసం పనిచేయడమే నా పని.. ప్రతిపక్షాలన్నీ ఐక్యమయ్యేలా చేస్తాను. ప్రతిపక్ష పార్టీలన్నింటిని ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు అందరితో కలిసి పనిచేస్తాను. ఇప్పటికే నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. అయితే బీహార్ ప్రజలకు అత్యుత్తమమైన పాలన అందించడమే తన తొలి ప్రాధన్యతగా చెప్పుకొచ్చారు.

పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీపై సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. తాము ఆదిశగా ప్రయత్నిస్తామన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ..తాను అవేమి పట్టించుకోనన్నారు. తనను ఎక్కువుగా విమర్శిస్తే వారికి ఆపార్టీలో మేలు జరుగుతుంది. పదవులు వస్తాయి. అందుకే తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు జడ్ ప్లస్ కేటగిరిపై బీజేపీ విమర్శలను నితీష్ కుమార్ కొట్టిపారేశారు. ఒక ఉపముఖ్యమంత్రికి భద్రత కల్పిస్తే ఎందుకు ఇష్యూ చేస్తున్నారో తెలియడం లేదన్నారు.

ఇదికూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..