Pet Lovers: పెంపుడు జంతువులను పెంచుకునే వారికి షాకింగ్ న్యూస్.. మహిళపై శునకం దాడి.. పరిస్థితి విషమం

పెంపుడు జతువులంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఒక్కోసారి టైముంటే ఇంట్లో ఎవరూ లేకపోయినా వాటితోనే టైంపాస్ చేస్తుంటాం. అయితే జంతువుల పెంపకాన్ని

Pet Lovers: పెంపుడు జంతువులను పెంచుకునే వారికి షాకింగ్ న్యూస్.. మహిళపై శునకం దాడి.. పరిస్థితి విషమం
Pet
Follow us

|

Updated on: Aug 12, 2022 | 1:44 PM

Pet Lovers: పెంపుడు జతువులంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఒక్కోసారి టైముంటే ఇంట్లో ఎవరూ లేకపోయినా వాటితోనే టైంపాస్ చేస్తుంటాం. అయితే జంతువుల పెంపకాన్ని కొన్ని అపార్టుమెంట్లలో నిషేధిస్తుంటారు. అక్కడికి వచ్చేవారిని గాయపరుస్తాయనే ఉద్దేశంతోనూ లేదా అరుస్తూ డిస్టపెన్స్ క్రియేట్ చేస్తాయనే కారణతో పెంపుడు జంతువులను ఉంచుకోవడం పై బ్యాన్ విధిస్తారు.ఈక్రమంలో తాజాగా గురుగ్రామ్ లో జరిగిన ఓ సంఘటన కలకలం రేపుతోంది. సివిల్ లైన్స్ ప్రాంతంలోని ఓ పెంపుడు కుక్క దాడిచేయడంతో 30ఏళ్ల మహిళ ప్రాణాలతో పోరాడుతోంది. బాధితురాలు మున్ని స్థానికంగా కొన్ని ఇళ్లల్లో పనిమనిషిగా చేస్తుంది. ఆమె తన పని నిమిత్తం వెళ్తుండగా స్థానిక నివాసి అయిన వినిత్ చికారా తన పెంపుడు కక్కను వాకింగ్ కి తీసుకొచ్చాడు. ఆసమయంలో అతను కక్కను వదిలేయడంతో అది మున్నిపై దాడి చేసి.. శరీరాన్ని గాయపర్చింది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఉండగా.. గతంలోనూ లక్నోలోని కైసర్ బాగ్ ప్రాంతంలో 82 ఏళ్ల రైటైర్డ్ టీచర్ పెంపుడు కక్క దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో కొన్ని కాలనీలు, అపార్ట్ మెంట్లలో పెంపుడు జంతువుల పెంపకంపై నిషేధం విధిస్తున్నారు. ఈనేపథ్యంలో పెంపుడు జంతువులకు సంబంధించిన చట్టాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం..

పెంపుడు జంతువుల నిషేధం చట్టవిరుద్ధం: సెక్షన్ 9(కె) ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్, 1960 ప్రకారం అపార్ట్ మెంట్లు లేదా ఇతర భవన సముదాయాల్లో పెంపుడు జంతువులను అనుమతించకపోవడం చట్టవిరుద్ధం, పెంపుడు జంతువులకు అనుమతి నిరాకరిస్తూ హౌసింగ్ సొసైటీలు చట్టాలు చేయడం కూడా నేరం. జంతువుల పట్ల సానుకూల ధృక్పదంతో వ్యవహరించడం, వాటి పట్ల కనికరం, దయ చూపడం ప్రతి పౌరుడి విఇగా భావించాలి.

వివక్షకు అనుమతి లేదు: పెంపుడు జంతువులు లేదా కుక్కలను వాటి జాతి, పరిమాణం ఆధారంగా నిషేధించదు. కుక్క మొరిగడం సహా ఇతర అలవాట్లకు సంబంధించిన కారణాలతో పెంపుడు జంతువును నిషేధించడానికి హౌసింగ్ సొసైటీలకు ఎటువంటి హక్కు లేదు.

ఇవి కూడా చదవండి

అపార్ట్ మెంట్లలో సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చు: అపార్టుమెంట్లు లేదా ఇతర పెద్దపెద్ద భవన సముదాయాల్లో లిఫ్టులు, ఆప్రాంతాల్లోని పార్కులు వంటి సాధారణ సౌకర్యాలను పెంపుడు జంతువులు ఉపయోగించకుండా నిషేధం లేదు. అలాగే అటువంటి సౌకర్యాలను ఉపయోగించుకున్నందుకు ఎటువంటి జరిమానా విధించే హక్కు ఏమాత్రం లేదు.

క్రూరత్వం శిక్షార్హం: సమాజంలో కుక్కలు లేదా పెంపుడు జంతువులను వేధించడం చట్టరీత్యా నేరం. జంతువుల పట్లఎవరైనా క్రూరత్వంతో వ్యవహరిస్తే భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 428 మరియు 429 ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

దాణాపై నిషేధం లేదు: కుక్కులు, పిల్లులు లేదా ఇతర పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వకుండా నిషేధించే హక్కు లేదు. అయితే పెంపుడు జంతువుల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వాటిని సింగిల్ గా వదిలేయకూడదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అది బయటకు రాకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..