IRCTC: ప్రయాణికుల డేటాను అమ్ముకుంటోందన్న వార్తలపై స్పందించిన ఐఆర్‌సీటీసీ.. మాకు ఆ ఉద్దేశం లేదంటూ..

IRCTC: దేశంలో మెజారిటీ రైల్వే టికెట్లను విక్రయిస్తోన్న ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్‌ టూరిజం కార్పారేషన్‌ (IRCTC) ప్రయాణికుల డేటాను అమ్ముకుంటోంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే...

IRCTC: ప్రయాణికుల డేటాను అమ్ముకుంటోందన్న వార్తలపై స్పందించిన ఐఆర్‌సీటీసీ.. మాకు ఆ ఉద్దేశం లేదంటూ..
Irctc
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 4:21 PM

IRCTC: దేశంలో మెజారిటీ రైల్వే టికెట్లను విక్రయిస్తోన్న ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్‌ టూరిజం కార్పారేషన్‌ (IRCTC) ప్రయాణికుల డేటాను అమ్ముకుంటోంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ప్రయాణికుల డిజిటల్‌ డేటాను మానిటైజ్‌ చేయడం ద్వారా రూ. 1000 కోట్లు ఆర్జిండమే లక్ష్యంగా పెట్టుకుందని ఇందుకోసం ప్రయాణికుల డేటాను అమ్ముకుంటోందని వార్తలు వచ్చాయి. సంప్రదాయ మీడియాతో పాటు సోషల్‌ మీడియాలోనూ కథనాలు హల్చల్‌ చేశాయి.

అయితే ఈ వ్యవహారంపై ఐఆర్‌సీటీసీ ఎట్టకేలకు అధికారికంగా స్పందించింది. మీడియాలో, సోషల్‌ మీడియాల్లో వస్తోన్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని ఖండించింది. ఐఆర్‌సీటీసీకి చెందిన ముఖ్య అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘మేము డేటాను విక్రయించడం లాంటివి చేయడం లేదు, మాకు ఆ ఉద్దేశం కూడా లేదు. మీడియాలో వస్తోన్న వార్త కథనాలు పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని మరింత మెరుగు పరచడానికి మాత్రమే కన్సల్టెంట్స్‌ను నియమించుకుంటాము’ అని తెలిపారు. అంతేకాకుండా ఐఆర్‌సీటీసీ తమ వినియోగదారుల డేటాను స్టోర్‌ చేసుకోదు. పేమెంట్ చేసే సమయంలోనూ ఆయా బ్యాంకుల పేమెంట్‌ గేట్‌వేలకు సమాచారం బదిలీ అవుతుంది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ నియమించుకున్న కన్సల్టెన్సీ కేవలం తమ సేవలను మరింత మెరుగుపరుచుకోవడం కోసమేనని తేల్చి చెప్పింది. దీంతో గత రెండు రోజులు వస్తోన్న వార్తలకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేసింది.

ఇదిలా ఉంటే ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం ఏకంగా 10 కోట్ల మంది యూజర్లను కలిగి ఉంది. తాజాగా ఈ సంస్థ కొత్తగా కన్సల్టెన్సీని నియమించుకోవడంతో ప్రయాణికుల డేటాను మానిటైజ్‌ చేస్తోందని, డేటాను ఇతర ప్రైవేట్‌ కంపెనీలకు విక్రయిస్తోంది అంటూ వార్తలు వచ్చాయి. కన్సల్టెన్సీల కోసం ఏకంగా ఈ టెండర్‌ను కూడా ఆహ్వానించింది అంటూ పుకార్లు షికార్లు చేయడంతో ఐఆర్‌సీటీసీ అధికారికంగా స్పందించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..
33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ వచ్చేసిందోచ్..
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ వచ్చేసిందోచ్..
ట్రైన్‌‌ స్లీపర్ భోగీలో గుప్పుమన్న వింతైన వాసన..
ట్రైన్‌‌ స్లీపర్ భోగీలో గుప్పుమన్న వింతైన వాసన..
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తోంది.. గ్లామర్ సెన్సేషన్..
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తోంది.. గ్లామర్ సెన్సేషన్..
ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి
ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
అలా ఉన్నా డయాబెటిస్ బారిన పడతారంట.. షాకింగ్ విషయాలు..
అలా ఉన్నా డయాబెటిస్ బారిన పడతారంట.. షాకింగ్ విషయాలు..
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం..!
ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం..!