Mumbai: ముంబైలో 26/11 తరహా దాడులు చేస్తాం.. కలకలం రేపుతున్న వాట్సప్ మెసెజ్..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రదాడులు చేస్తామంటూ వచ్చిన వాట్సప్ సందేశాలు కలకం రేపుతోంది. ఈరోజు ఉదయం ట్రాఫిక్ కంట్రోల్ వాట్సప్ నెంబర్ కు వచ్చిన మెసెజ్..
Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రదాడులు చేస్తామంటూ వచ్చిన వాట్సప్ సందేశాలు కలకం రేపుతోంది. ఈరోజు ఉదయం ట్రాఫిక్ కంట్రోల్ వాట్సప్ నెంబర్ కు వచ్చిన మెసెజ్ లో 26/11 తరహా ఉగ్రవాద దాడులు జరుగుతామని దుండగులు హెచ్చరించారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ సందేశం పొరుగు దేశమైన పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఎలా దాడులకు పాల్పడతాం. ఏ ప్రాంతంలో దాడులు చేస్తామనేది ఈసందేశంలో స్పష్టంగా లేదని పోలీసులు వెల్లడించారు.
2008 నవంబర్ 11వ తేదీన ముంబై నగరంలో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు జరిపిన దాడులను పోలినట్లు మరో ఉగ్రదాడి ఉండబోతుందని ఈసందేశంలో పేర్కొన్నారు. ఈఘటనపై ప్రతిపక్ష ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ స్పందిస్తూ.. ఈబెదిరింపు సందేశాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టాలన్నారు. మరోవైపు మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరు పంపించారనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..