Viral: ఇంటి నిర్మాణానికి పునాదులు తవ్వుతుండగా బయపడిన పెట్టె.. ఓపెన్ చేయగా కళ్లు మిరుమిట్లుగొలిపే
అదృష్టం వచ్చి కాలింగ్ బెల్ కొడితే రాంగ్ అడ్రస్ అని పంపించివేశారు ఈ మామాకోడళ్లు. ఉన్నపలంగా కోటీశ్వర్లు అయ్యే అవకాశం వస్తే కావాలనే చేతులారా మిస్ చేసుకున్నారు. ఆ వివరాలు....
Trending: వీళ్లకంటే తింగరోళ్లు ఉంటారా చెప్పండి. మెడలో వేసుకోమని గోల్డ్ చెయిన్ ఇస్తే గొంతుకు ఉరేసుకున్నట్లు ఉంది వీళ్లు తంతు. గొడవల పెట్టుకుని మరీ తలుపుతట్టిన అదృష్టాన్ని వెనక్కి పంపించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్(uttar pradesh)లోని.. మెయిన్‌పురి(Mainpuri) జిల్లా నాగ్లా ఖేడా గ్రామంలో మహావీర్ సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు ఇటీవల తన ఇంటికి సంబంధించిన నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో తవ్వకాలు జరపుతుండగా.. కూలీలకు ఓ పెట్టె కనిపించింది. వెంటనే దాన్ని తీసుకొచ్చి.. మహావీర్ ఇంట్లో లేకపోవడంతో అతని కొడలికి ఇచ్చారు. ఆమె ఆ బాక్స్ ఓపెన్ చేయగా లోపల కళ్లు జిగేల్ అనేలా రకరకాల బంగారు నగలు కనిపించాయి. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే ఆమెకు అత్యాస పుట్టింది. ఆ ఆభరణాలు అన్నింటిని దాచేసింది. సాయంకాలం ఇంటికి వచ్చిన మహావీర్‌కు నగల పెట్టె గురించి తెలిసింది. వాటి గురించి కోడలిని అడిగాడు. ఆమె మాత్రం ఆ నగలను మామకు ఇచ్చేందుకు నిరాకరించింది. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సమాధానం ఇచ్చింది. కోపంతో మహావీర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిదంతా చెప్పాడు. నగల పెట్టె గురించి అడిగితే కోడలు దుర్భాషలాడుతూ బెదిరించిందని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంటికి వచ్చి ఆ నగల పెట్టె స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తానికే మోసం వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఈ మామాకోడలిని ఏమనాలో…! (Source)
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..