Rajiv Gandhi Birth Anniversary: నాన్నా.. నువ్వు ప్రతిక్షణం మాతోనే ఉన్నావు.. తండ్రి జయంతి రోజున రాహుల్ ఎమోషనల్
Rajiv Gandhi Birth 78th Anniversary: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్‌భూమిలో ఉన్న రాజీవ్ గాంధీ సమాధి వద్ద అంజలి ఘటించారు
Rajiv Gandhi Birth 78th Anniversary: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్‌భూమిలో ఉన్న రాజీవ్ గాంధీ సమాధి వద్ద అంజలి ఘటించారు. వీరివెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, ఎంపీ కేసీ వేణుగోపాల్, రాబర్ట్ వాద్రా తదితరులు ఉన్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనాతో బాధపడుతున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ఆమె దూరంగా ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ (PM Narendra Modi) కూడా ట్విట్టర్ వేదికగా రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.
Delhi | Congress MP Rahul Gandhi, general secretary Priyanka Gandhi Vadra, Robert Vadra, MP KC Venugopal, and LoP Mallikarjun Kharge pay homage to former PM Rajiv Gandhi, on his 78th birth anniversary at Vir Bhumi. pic.twitter.com/Pqoc4YU1hl
ఇవి కూడా చదవండి— ANI (@ANI) August 20, 2022
కాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు రాహుల్. తన తండ్రికి సంబంధించిన మధురజ్ఞాపకాలను ఓ వీడియో రూపంలో షేర్ చేస్తూ ‘పాపా, నువ్వు ప్రతి క్షణం నా హృదయంలో, నాతోనే ఉన్నావు. దేశం కోసం మీరు కలలుగన్న కలలను నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తాను’ అని ఎమోషనల్ అయ్యారు. కాగా రాజీవ్ గాంధీ జయంతిని ఏటా సద్భావన దినోత్సవంగా నిర్వహిస్తారు. అతి పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి రాజీవ్ పలు సంస్కరణలను అమల్లోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఐటీ, టెలికాం రంగాలకు సంబంధించి విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. అయితే1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం జరిపిన ఓ ఆత్మాహుతి దాడిలో రాజీవ్ మృతిచెందారు.
पापा, आप हर पल मेरे साथ, मेरे दिल में हैं। मैं हमेशा प्रयास करूंगा कि देश के लिए जो सपना आपने देखा, उसे पूरा कर सकूं। pic.twitter.com/578m1vY2tT
— Rahul Gandhi (@RahulGandhi) August 20, 2022
మరిన్ని జాతీయవార్తల కోసం క్లిక్ చేయండి..