AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona: కరోనా నుంచి కాస్త ఊరట.. తగ్గిన కొత్త కేసులు.. ఆ రాష్ట్రాల్లో పెరుగుతున్న వైరస్‌ బాధితులు

Covid 19 Updates: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే రోజువారీ కేసుల్లో కాస్త హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గురువారం 15వేలకు పైగా మంది వైరస్‌ బారిన పడితే.. గత 24 గంటల్లో 13, 272 కొత్త కేసులు వెలుగు చూశాయి.

India Corona: కరోనా నుంచి కాస్త ఊరట.. తగ్గిన కొత్త కేసులు.. ఆ రాష్ట్రాల్లో పెరుగుతున్న వైరస్‌ బాధితులు
India Corona
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 4:22 PM

Covid 19 Updates: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే రోజువారీ కేసుల్లో కాస్త హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గురువారం 15వేలకు పైగా మంది వైరస్‌ బారిన పడితే.. గత 24 గంటల్లో 13, 272 కొత్త కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 3.15 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఉదయం కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం దేశంలో 1,01,166 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.21 శాతంగా ఉండగా, వారాంతపు పాజిటివిటీ రేటు 3.87 శాతంగా ఉంది.

ఇక గడిచిన 24 గంటల్లో 13,900 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. ఇక శుక్రవారం మరో 36 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో రోజువారీ కేసులు వెయ్యికి పైనే ఉండడం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. నిన్న మహారాష్ట్రలో 2285, దిల్లీలో 1417, కర్ణాటకలో 1573, కేరళలో 1093 కేసులు నమోదయ్యాయి. ఇక వైరస్‌ కట్టడికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. నిన్న దేశవ్యాప్తంగా 13,15,536 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 209.40 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో బూస్టర్ డోసుల సంఖ్య 13.30 కోట్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..