AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black water: సినీ తారల సీక్రెట్‌ బ్లాక్‌ వాటర్‌..! ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

చర్మం పొడిబారకుండా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఈ బ్లాక్‌ వాటర్‌ సహాయపడుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నీరు ఏకాగ్రతను పెంచుతుంది,..

Black water: సినీ తారల సీక్రెట్‌ బ్లాక్‌ వాటర్‌..! ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
Black Water
Jyothi Gadda
|

Updated on: Aug 20, 2022 | 11:36 AM

Share

Black water: సినీ తారల సీక్రెట్‌ బ్లాక్‌ వాటర్‌..! ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.. బ్లాక్‌ వాటర్‌.. ఈ పేరు వింటేనే చాలామందికి వికారం, వాంతులు వచ్చేలా ఉంది.. ఎందుకంటే.. తెల్లటి, స్వచ్ఛమైన నీటినే మనం ఎక్కువగా ఇష్టపడతాం. అలాంటి స్వచ్ఛమైన నీటికోసం డబ్బు ఖర్చుపెట్టి మరీ మార్కెట్‌లో కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఇక్కడ మాత్రం నల్లగా, కషాయం కంటే దారుణంగా కనిపిస్తున్న ఈ బ్లాక్‌ వాటర్‌ని సినీ, క్రీడా ప్రముఖులు కొందరు ఎగబడి తాగుతున్నారట. అవును, ఈ మాట నిజమే.. ఎందుకంటే ఇలాంటి బ్లాక్‌ వాటర్‌లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్లాక్‌ వాటర్‌ ప్రయోజనాలు సాధారణ మనం తాగే మంచినీళ్లలో ph స్థాయి 7 ఉంటే.. ఈ బ్లాక్ వాటర్‌లో అంతకుమించి ఉంటుందట. అలానే బాడీని హైడ్రేటెడ్‌, ఫిట్‌గా ఉంచటంలో ఈ బ్లాక్ వాటర్ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే 70% ఖనిజాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణప్రక్రియని మెరుగుపరుస్తుంది.శరీరానికి సరిపడా ఈ నీరు తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, జీర్ణశయాంతర ప్రేగు సమస్యలను నివారిస్తుంది.

బ్లాక్‌ వాటర్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఈ బ్లాక్‌ వాటర్‌ సహాయపడుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నీరు ఏకాగ్రతను పెంచుతుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

వేసవిలో ఈ నీటిని ఎక్కువగా తీసుకుంటే.. సన్‌స్ట్రోక్‌ నుంచి బయటపడవచ్చు. బ్లాక్‌ వాటర్‌ శరీర వేడిని తగ్గిస్తుంది. బ్లాక్‌ వాటర్‌ రక్తపోటును అదుపులో ఉంచడం, కీళ్లలో జిగురు పెంచడంలోనూ శరీర కీలకమైన విధుల్లో పాల్గొంటుంది. జీవక్రియ, నాడీ సంబంధిత విధులను మారుస్తుంది.

మనం రోజూ తీసుకునే నీటిలో సాధారణంగా అకర్బన లవణాలు ఉంటాయి. అయితే బ్లాక్ వాటర్ లో నీరు ఎక్కువ ఆల్కలీన్‌గా ఉంటుంది.  అందువల్ల బ్లాక్‌ వాటర్‌ని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

అందుకే, పలువురు హీరోయిన్లు మలైకా అరోరా, ఊర్వశి రౌతేలా, శ్రుతి హాసన్ తదితరులు కూడా ఈ బ్లాక్ వాటర్‌ని తాగుతున్నారట. భారత్‌లో విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుతం బ్లాక్ వాటర్ తాగుతున్న జాబితా కూడా గత కొన్ని నెలల నుంచి క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి