AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Back Pain: వెన్నునొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్‌ టిప్స్‌తో ఉపశమనం పొందండి

Health Tips: ఈ రోజుల్లో యువతలో వెన్ను నొప్పి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోజూ 9-10 గంటల పాటు కంప్యూటర్ ముందు పని చేయడం, విశ్రాంతి లేకుండా పనిచేయడం, తీవ్ర పని ఒత్తిడి తదితర కారణాలు వెన్నునొప్పికి ప్రధాన కారణాలు.

Back Pain: వెన్నునొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్‌ టిప్స్‌తో ఉపశమనం పొందండి
Back Pain
Basha Shek
|

Updated on: Aug 20, 2022 | 9:58 AM

Share

Health Tips: ఈ రోజుల్లో యువతలో వెన్ను నొప్పి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోజూ 9-10 గంటల పాటు కంప్యూటర్ ముందు పని చేయడం, విశ్రాంతి లేకుండా పనిచేయడం, తీవ్ర పని ఒత్తిడి తదితర కారణాలు వెన్నునొప్పికి ప్రధాన కారణాలు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి ప్రజలు అనేక రకాల మందులు కూడా తీసుకుంటారు. అయితే వీటివల్ల తాత్కాలిక ఉపశమనం దొరుకుతుంది కానీ దీర్ఘకాలికంగా ఎక్కువ మందులు వాడితే భవిష్యత్‌లో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని ఇంటి చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

వెల్లుల్లితో..

వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు వెన్నునొప్పిని దూరం చేస్తాయి. ఇందుకోసం ఒక బౌల్‌లో ఆవాల నూనె తీసుకోండి. ఈ నూనెను కొద్దిగా వేడి చేసిన తర్వాత, అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేయండి. వెల్లుల్లిని బాగా కాల్చిన తర్వాత నూనెను దించి కాస్త చల్లార్చాలి. ఆ తర్వాత ఆ ఆయిల్‌తో నడుముపై సున్నితంగా మర్దన చేసుకోవాలి. తరచుగా ఇలా చేయడం వల్ల వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

పసుపుతో..

పసుపులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒళ్లు నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. వెన్నునొప్పి ఎక్కువగా వేధిస్తున్నట్లయితే రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగండి. దీంతో వెన్నునొప్పి సమస్యలు దూరమవుతాయి.

కొబ్బరి నూనెతో..

పురుషులు వెన్నునొప్పిని తగ్గించడానికి కొబ్బరి నూనె, కర్పూరాన్ని ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక పాత్రలో కొబ్బరి నూనెను వేడి చేసి, దానికి కాస్త కర్పూరం జోడించండి. నూనె చల్లబడిన తర్వాత నొప్పి ఉన్నచోట సున్నితంగా మర్దన చేసుకోండి. తరచూ ఇలా చేయడం వల్ల వెన్ను నొప్పి దూరమవుతుంది.

విరామం తీసుకోండి..

గంటల తరబడి ఒకే చోట కూర్చోవడానికి బదులు, మధ్యలో కాస్త విరామం తీసుకోండి. కుర్చీలో నుంచి లేచి 2 నిమిషాల పాటు అటూ ఇటూ నడవండి. బరువు తగ్గాలనే తొందరలో ఎక్కువ వ్యాయామం చేయవద్దు. ఒక్కోసారి ఇది కూడా వెన్నునొప్పికి దారి తీస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...