Health: డయాబెటిక్ పేషెంట్లకు పెసర పప్పు అద్భుత ఆహారం.. ఆహారంలో భాగం చేసుకుంటే అంతులేని ప్రయోజనాలు
పప్పు (Dal) ధాన్యాల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. నాన్ వెజ్ తినని వాళ్లకు పూర్తి వెజ్ పదార్థాలను మాత్రమే తీసుకునేవారికి తగినంత ప్రొటీన్ అందాలంటే తప్పకుండా డైట్ లో పప్పు ధాన్యాలను చేర్చుకోవాలని నిపుణులు...
పప్పు (Dal) ధాన్యాల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. నాన్ వెజ్ తినని వాళ్లకు పూర్తి వెజ్ పదార్థాలను మాత్రమే తీసుకునేవారికి తగినంత ప్రొటీన్ అందాలంటే తప్పకుండా డైట్ లో పప్పు ధాన్యాలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారుర. పప్పులో ప్రోటిన్ తో పాటు విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కంది పప్పు, ఎర్ర కంది పప్పు, శనగ పప్పు, బఠాణీలు, చిక్కుడు, పెసర పప్పు, బొబ్బర్లు, మినప్పప్పు ఇలా పప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇవి అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాకుండా మంచి పోషక పదార్థాలూ ఉంటాయి. అయితే పప్పుల్లో పెసర పప్పు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయుర్వేదంలో పెసర పప్పు (Moong Dal )ను ‘క్వీన్ ఆఫ్ పల్సెస్ ‘ అని పేర్కొన్నారు. పెసర పప్పులో ప్రోటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్-బి6, నియాసిన్, ఫోలేట్ ఉంటాయి. పెసర పప్పును క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. మిగిలిన పప్పులతో పోలిస్తే పెసర పప్పు త్వరగా జీర్ణమవుతుంది. తక్కువ మొత్తంలో గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. పెసర పప్పును వండే ముందు నానబెడితే మంచిదని సూచించారు. ఇలా చేయడం వల్ల వాటి నుంచి ఫైటిక్ యాసిడ్ తొలగి మరింత సులభంగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది.
డయాబెటిక్ పేషెంట్స్ పెసర పప్పును డైట్ లో భాగం చేసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. పసర పప్పులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు అనేకం ఉన్నాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. బరువు కంట్రోల్‌లో ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశాలను తగ్గిస్తుంది. పెసరపప్పు శరీరంలో మంట, నొప్పిని తగ్గిస్తుంది. అర్థరైటిస్ సమస్య ఉన్నవారు పెసర పప్పు తింటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం