IND Vs ZIM: సిరీస్‌ విజయంపై కన్నేసిన టీమిండియా.. జింబాబ్వేతో రెండో వన్డే నేడు.. బ్యాటింగ్‌లో మార్పులు?

IND Vs ZIM 2nd ODI: ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ పర్యటనల్లో అదరగొట్టిన టీమిండియా జింబాబ్వే పర్యటనలోనూ శుభారంభం చేసింది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై భారత క్రికెట్ జట్టు 10 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది.

IND Vs ZIM: సిరీస్‌ విజయంపై కన్నేసిన టీమిండియా.. జింబాబ్వేతో రెండో వన్డే నేడు.. బ్యాటింగ్‌లో మార్పులు?
India Vs Zimbabwe
Follow us
Basha Shek

|

Updated on: Aug 20, 2022 | 7:38 AM

IND Vs ZIM 2nd ODI: ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ పర్యటనల్లో అదరగొట్టిన టీమిండియా జింబాబ్వే పర్యటనలోనూ శుభారంభం చేసింది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై భారత క్రికెట్ జట్టు 10 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. తద్వారా కేఎల్‌ రాహుల్ (KL Rahul) కెప్టెన్సీలో భారత్‌కు తొలి విజయం వరించింది. ఇప్పుడు అతని కెప్టెన్సీలో తొలిసారిగా టీమిండియాకు సిరీస్ గెలిచే అవకాశం వచ్చింది. ఇందులో భాగంగా రెండు జట్ల మధ్య రెండో మ్యాచ్ శనివారం జరగనుంది. ఈ వన్డేలోనూ గెలిచి టీమ్ ఇండియా సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సొంత ప్రేక్షకుల అభిమానం పొందాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది.

కేఎల్ రాహుల్‌కు కీలకం.. కాగా కరోనా, అంతకుముందు గాయాలతో జట్టుకు దూరంగా ఉన్నాడు కేఎల్‌ రాహుల్‌. దీంతో ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌లకు ముందు తన పూర్తి సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే తొలి మ్యాచ్‌లో శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌ విజయాన్ని ఖరారుచేయడంతో రాహుల్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. దీంతో రెండో వన్డే అతనికి కీలకం కానుంది. ఎందుకంటే ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో ఉండటంతో అక్కడ పాకితో పోటీ పడాల్సి ఉంది. మరోవైపు తొలి వన్డేలో శిఖర్ ధావన్ గాయపడ్డాడు. అయితే రెండో వన్డేలో అతను బరిలోకి దిగుతాడా? లేదా? అన్నది స్పష్టత రాలేదు. శిఖర్‌ దూరమైతే ఇషాన్‌ కిషాన్‌ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో దీపక్ చాహర్ ఘనంగా పునరాగమనం చేశాడు. తద్వారా తన ఫిట్‌నెస్‌పై ఉన్న అనుమానాలను పటాపంచలు చేశాడు. మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ మరింత రాణించాల్సి ఉంది. మరి అవేష్ ఖాన్ కు అవకాశం ఇస్తారా లేదా అన్నది క్లారిటీ లేదు.

జట్ల అంచనాలు ఇవే..

ఇవి కూడా చదవండి

భారత్:

కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రితురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, షాబాజ్ అహ్మద్.

జింబాబ్వే:

రెగిస్ చకబ్వా (కెప్టెన్), ర్యాన్ బర్లే, తనకా చివాంగా, బ్రాడ్లీ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కీయా, టి కెటానో, క్లైవ్ మదాండే, వెస్లీ ఎం, టి మారుమణి, జాన్ మసారా, టోనీ మున్యోంగా, రిచర్డ్ అంగరవ, సికాన్, విక్టర్ న్ , మిల్టన్ షుంబా, డోనాల్డ్ తిరిపానో.

భారత్- జింబాబ్వే మధ్య రెండో వన్డే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రారంభం కానుంది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..