Cloudburst: అక్కడే మరో క్లౌడ్‌బరస్ట్.. వైష్ణోదేవి గుహను చుట్టుముట్టిన వరద.. రంగంలోకి ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు
నిన్నటి నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం సమీపంలో ప్రవహిస్తున్న తమసా నది భయంకర రూపాన్ని సంతరించుకుంది. మాతా వైష్ణో దేవి గుహ యోగా మందిరం,
Cloudburst: ఉత్తరాఖండ్‌లో మరో క్లౌడ్‌బరస్ట్.. వైష్ణోదేవి గుహను చుట్టుముట్టిన వరద.. రంగంలోకి ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం వద్ద భారీ వరదలు సంభవించాయి. డెహ్రాడూన్ జిల్లాలోని రాయ్‌పూర్ బ్లాక్‌లో సంభవించిన Cloudburst కారణంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం వద్ద భారీ వరదల వంటి పరిస్థితికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నిన్నటి నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం సమీపంలో ప్రవహిస్తున్న తమసా నది భయంకర రూపాన్ని సంతరించుకుంది. మాతా వైష్ణో దేవి గుహ యోగా మందిరం, తపకేశ్వర్ మహాదేవ్ మార్గం కొట్టుకుపోయింది. కొలను కూడా దెబ్బతింది. అని ఆలయ వ్యవస్థాపకుడు ఆచార్య బిపిన్ జోషి చెప్పారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జోషి తెలిపారు.
రాయ్‌పూర్ బ్లాక్‌లోని సర్ఖేత్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు Cloudburst అయినట్టుగా స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ముంపు గ్రామంలో చిక్కుకున్న ప్రజలందరినీ రక్షించారు. కొందరు సమీపంలోని రిసార్ట్‌లో ఆశ్రయం పొందుతున్నట్టు SDRF తెలిపింది.
#WATCH | Uttarakhand: Flash-flood-like situation due to incessant torrential rainfall at Tapkeshwar Mahadev temple in Dehradun pic.twitter.com/Q43inmiVht
— ANI (@ANI) August 20, 2022
ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని కత్రా పట్టణంలోని మాతా వైష్ణో దేవి మందిరం సమీపంలో శనివారం భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల దృష్ట్యా మాతా వైష్ణో దేవి ఆలయంలో భక్తుల రాకపోకలను కాసేపు నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కత్రా నుండి వైష్ణో దేవి ఆలయానికి యాత్రికులను నిలిపివేశారు. దిగువకు వచ్చే యాత్రికులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పోలీసులు,సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఇప్పటికే మోహరించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు తెలిపింది. అయితే, ఇప్పుడు పుణ్యక్షేత్రానికి భక్తుల రాకపోకలు తిరిగి ప్రారంభమైంది.